VAHANA SEVAS IN BRAHMOTSAVAMS CULMINATES WITH ASWA VAHANAM_ అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
Tirumala, 7 Oct. 19: Lord Malayappa Swamy portrayed Kalki Avatara on the Aswa Vahana Seva observed on the eighth day evening in Tirumala on Monday.
During the nine-day brahmotsavams, Lord has taken a ride on 16 different carriers (including Swarna Ratham and Maha Ratham). The vahana sevas has come to an end with Aswa Vahanam.
The significance of Aswa Vahanam is Horse is known for its speed. On the speeding divine horse, the Ucchaishrava, Sri Malayappa in the guise of Kalki, holding the sword in one hand, marched along the four Mada streets to bless His devotees. This implies, the Lord will save the world from the evil forces.
TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
తిరుమల, 2019 అక్టోబరు 07: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు సోమవారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఎనిమిదవరోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి అశ్వలక్షణం. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రమే! తర్వాతనే ఆవులూ, మేకలూ మున్నగు జంతువులు రూపొందాయి. ప్రయాణసాధనాల్లో మునుపు అశ్వానిదే అగ్రస్థానం. ఇప్పటికీ ఒకయంత్రంశక్తిని ‘హార్స్‌పవర్’ అనే పేరుతో గణించడం మనకు తెలుసు. రథాన్ని లాగేవి గుర్రాలే! యుద్ధాలలో ఆశ్వికదళం అధికంగా ఉంటుంది.
శ్రీహరి శ్రీనివాసుడై ఈలోకంలో వేంకటాచలం చేరి, అటనుండి పద్మావతీదేవిని పెండ్లాడడానికై మొట్టమొదట వేటనెపంతో గుర్రంపైన్నే వచ్చాడు. ఆ గుర్రమే తనకు వివాహవాతావరణాన్ని కల్పించడంలో ప్రముఖసాధనమైంది. శ్రీహరి యొక్క జ్ఞానావతారాల్లో మొదటిది హయగ్రీవావతారమే! అంటే గుర్రంముఖం కల్గినమూర్తి. హయగ్రీవుడు విద్యాధిదేవత. ఈకారణాలవల్లనూ స్వామికి బ్రహోత్సవవాహనసేవల్లో మొదట పెద్దశేషవాహనం కుండలినీ యోగానికి సంకేతమైతే – చివర అశ్వవాహనం ఓంకారానికి సంకేతమై – కుండలినీ యోగంతో ప్రణవాన్ని (ఓంకారాన్ని) చేరి, ఆనందించే తత్త్వాన్ని ఆద్యంత ఉత్సవాలు నిరూపిస్తున్నాయి. చక్కని సమన్వయాన్ని కల్గిస్తున్నాయి.
ఇంతేకాక ఈ కలియుగాంతంలో స్వామి కల్కిమూర్తియై గుర్రంపై పయనిస్తూ – ఖడ్గధారియై దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక ఈ అశ్వవాహనత్వం కల్కి అవతారాన్ని గుర్తుచేస్తూంది. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.