VAHANA SEVAS OF KRT CONCLUDES WITH ASWA VAHANAM_ అశ్వ వాహ‌నంపై జ‌గ‌ద‌భిరాముడు

Tirupati, 23 March 2018: After a hectic schedule of vahana sevas in the last eight days, Lord Sri Rama blessef the devotees on Aswa Vahanam on Friday evening.

The vahana seva spree concluded with Aswa Vahanam in eighth day evening.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs took part in this vahana seva.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అశ్వ వాహ‌నంపై జ‌గ‌ద‌భిరాముడు

మార్చి 23, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం రాత్రి
శ్రీ‌రామ‌చంద్రుడు అశ్వ‌వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.