VAHANA SEVAS OF TIRUMALA BRAHMOTSAVAMS KICK STARTS WITH PEDDA SESHA VAHANAM_ పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

Tirumala, 13 September 2018: On Day one of the ongoing annual Brahmotsavams in Tirumala, Sri Malayappaswamy, the processional deity of Sri Venkateswara Swamy took a celestial ride on Pedda Sesha Vahanam and thrilled the devotees who came in thousands to witness the event on Thursday evening.

Adi Sesha the seven hooded Serpent of God as His vehicle is considered as the Pedda Sesha Vahanam. Aadisesha is the seat on which Lord Sri Narayana rests in His abode Sri Vaikunta. Tirumala hills the abode of Lord Venkateswara is said to be the manifestation of Adisesha.

The idols of Malayappa swamy flanked on either side by His two divine consorts Sridevi and Bhudevi mounted atop the golden Pedda Sesha was taken on ride in four mada streets. The shesha vahanam is symbolic with Dhyana Bhakti and Dasya Bhakti.

CM TAKES PART

Honourable CM of AP Sri N Chandrababu Naidu also took part in this celestial fete at the beginning of the vahana seva.

TTD Chairman Sri Putta Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, TTD Trust Board Members Sri Challa Ramachandra Reddy, Sri Potluri Ramesh Babu,JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, VGO Sri Raveendra Reddy, Temple DyEO Sri Haridranath, Peishkars Sri Ramesh, Sri Nagaraj and others took part


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు : 

సెప్టెంబరు  13,  తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం  ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్‌, శ్రీ అమరనాథరెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, బోర్డు సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.