VAHANAMS SPREE AT VONTIMITTA BEGIMS WITH PEDDA SESHA VAHANAM_ శేషవాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని అభయం

Vontimitta, 25 March 2018: The series of vahana sevas at Vontimitta Sri Kodanda Rama Brahmotsavams commenced with Pedda Sesha Vahanam on Sunday evening.

In most of the Sri Vaishnavaite temples, the vahana seva during brahmotsavams usually begins with Pedda Sesha Vahana seva.

The serpent king Adisesha is usually described as having thousand hoods and serves His beloved Master in different ways as umbrella, bed, ornament etc. to showcase his loyalty towards Lord.

On Sunday evening lord Sri Rama took pleasure ride on the seven hooded Pedda Sesha Vahanam to bless His devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శేషవాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని అభయం

మార్చి 25, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవ‌త‌రించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి

సాంస్కృతిక కార్యక్రమాలు :

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీమతి అన్నపూర్ణ రామాయణంలో సోదరవాత్సల్యంపై ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీ ఎం.రవిచంద్ర బృందం భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీమతి కె.ప్రమీల శ్రీ సీతారాముల కల్యాణం హరికథ కార్యక్రమాలు నిర్వహించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.