PILGRIMS POUR IN PRAISE ON TTD FOR ARRANGEMENTS_ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 4.20 గంటలకు సర్వదర్శనం ప్రారంభం
Tirumala, 18 Dec. 18: The devotees have given full thumbs up to TTD for the excellent arrangements for Vaikunta Ekadasi which was held with utmost celestial grandeur on Tuesday.
Devotees expressed their happiness as the dwara darshan for commoners on Vaikunta Ekadasi began at 04:20 hours, which is one hour in advance as was stated earlier by TTD authorities, marking a new record at Srivari Temple.
The Govinda Nama chanting by devotees reverberated the temple precincts and there was allround appreciation about the arrangements made by TTD in queue lines, Narayanagiri, four mada streets, Kalyana Vedika etc. to accommodate devotees with timely supply of food and water without making them stand for hours together in serpentine queue lines.
The devotees cheered the Chairman Sri Putta Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal and JEO Sri KS Sreenivasa Raju for the pilgrim friendly arrangements ensuring them hassle free darshan.
DEDICATED SERVICE BY TTD STAFF: JEO RAJU
Speaking to reporters JEO Sri Sreenivasa Raju said since Monday morning over one-lakh devotees had landed in Tirumala and the queue lines had touched the ring roads and the TTD employees were serving them with dedication without break.
He said limited numbers of VIP tickets were issued and priority was given for hassle free darshan to common devotees.
After darshan to devotees in VQC, devotees waiting in Narayanagiri gardens sheds were into VQC. Similarly Devotees in Mada streets were made to enter into the sheds of Narayanagiri Gardens.
He appreciated the teamwork of all departments in giving their best possible services to devotees and also complimented the impeccable services of Srivari Sevakulu, Scouts, Vigilance of TTD and police. He also thanked the TTD board Chairman Sri P Sudhakar Yadav and other members, EO Sri AK Singhal for giving proper directions to TTD staff for smooth conduction of Vaikunta Ekadasi.
ARRAGEMENTS BY TTD EXCEPTIONAL
Meanwhile the pilgrims poured in praises on the arrangements made by TTD to meet the pilgrim crowd on big day.
Sri Lakshman Solanki from Pandaripur of Maharashtra said, I was made to sit in West Mada Street shed on Monday. The continuous food, beverages and water supply by srivari sevaks and the LED screen displaying devotional programmes provided me a homely environment. Though there was chillness outside, the covers of the sheds provided us comfortable and safe stay in such a manner that the waiting time also not bothered us. Hats off to TTD for these fabulous arrangements. Our compartment was released today morning at around 6am. I had a very good darshanam of Lord Balaji, he said.
It is the reaction from Sri Marimuthu of Tiruppur, Sri Sukla from Dharwad, Sri Sitaram from Hyderabad, and Smt Vijayalakshmi from Vijayawada. They all heaped in praises on TTD for the hassle free arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 4.20 గంటలకు సర్వదర్శనం ప్రారంభం
ఒక గంట ముందుగా దర్శనం మొదలుకావడంతో భక్తుల సంతోషం
శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టిటిడి ఛైర్మన్, ఈవో, జెఈవో
డిసెంబరు 18, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 4.20 గంటలకు సర్వదర్శనం ప్రారంభించడంతో సామాన్యభక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి ఒక గంట ముందుగానే సర్వదర్శనం ప్రారంభం కావడంతో భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీవారి ఆలయం, బయటి క్యూలైన్లలో భక్తుల ఏర్పాట్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా టిటిడి ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
టిటిడి సిబ్బంది అకుంఠిత దీక్షతో భక్తులకు సేవలు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
ఈ సందర్భంగా జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం నుండి ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వచ్చారని, క్యూలైన్ రింగ్ రోడ్ వరకు చేరిందని, వేచి ఉన్న భక్తులకు టిటిడి సిబ్బంది అకుంఠిత దీక్షతో సేవలందిస్తున్నారని కొనియాడారు. విఐపిలకు పరిమిత సంఖ్యలోనే దర్శన టికెట్లు కేటాయించి, సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఒక క్రమపద్ధతిలో నారాయణగిరి షెడ్లలోని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి, ఆలయ మాడ వీధుల్లోని షెడ్లలో గల భక్తులను నారాయణగిరి ఉద్యానవనాల్లోకి పంపుతున్నామన్నారు. ప్రస్తుతం వేచి ఉన్న భక్తులకు బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం లభిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు. వైద్యసౌకర్యం కల్పిస్తున్నారని వెల్లడించారు. పోలీసులు, టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, స్కౌట్స్, శ్రీవారి సేవకులతో భక్తులను క్రమబద్దీకరించి పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ పర్వదినాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆదేశాలిచ్చి సహకరించిన టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా 400 చిలుకలు, చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు. శ్రీవారి ఆలయం వద్దగల వాహన మండపం ఎదురుగా విష్ణుమయం పేరుతో భక్తులను ఆకట్టుకునేలా సెట్టింగ్ ఏర్పాటుచేశారు. ఇందులో మంచు ఎఫెక్ట్‌తో సప్తద్వారాలతో కూడిన శ్రీ రంగనాథస్వామి, శ్రీ రంగనాయకి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు దశావతారాలను రూపొందించారు.
వైభవంగా స్వర్ణరథోత్సవం :
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.
డిసెంబరు 19న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
డిసెంబరు 19న వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.