ELABORATE ARRANGEMENTS FOR VAIKUNTHA EKADASI, DWADASI AND NEW YEAR DAYS-TIRUMALA JEO_ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 సందర్భంగా భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 12 December 2017: The temple management of TTD has been doing elaborate arrangements for the upcoming three important days, Vaikuntha Ekadasi, Vaikuntha Dwadasi and New Year Day, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

A review meeting with all HoDs of TTD, APSRTC and Police officials took place at Annamaiah Bhavan in Tirumala on Tuesday. Speaking on this occasion the JEO said,in view of these three important days where unprecedented pilgrim crowd is expected, TTD has cancelled all arjitha sevas and Divya Darshnam tokens from December 28 to January 1. He also said there will be no privilege darshan for aged, handicapped and parents with infants and donors on these days.

The JEO also said, on December 28, the devotees will be allowed in to compartments from 10am onwards. When all the compartments are full, special queue lines were laid at Alwar Tank, Narayanagiri Gardens, VQC 2, Karnataka Chowltries 2, Medaramitta, near North Mada Street and up to ring road near Bata Gangammagudi. “On December 29-Vaikuntha Ekadasi, since it is on Friday, the sarva darshan delays by 4 hours due to Abhisheka Seva. The break darshan will be from 5:30am to 8am which will be followed by sarva darshan”, the JEO informed.

Adding further the JEO said, for constitutional dignitaries, including judicial officers the accommodation allotment counters are set up at Venkata Nilayam, for MLCs, MLAs, MPs in Ramaraja Nilayam and Sita Nilayam, for IAS officers at Sannidhanam, other officers in Gumble Guest House. If the constitutional dignitaries come for self darshan, they will be allotted five tickets apart from the dignitary and in the case of IAS officers and public representatives one plus three tickets will be allotted. The pilgrims are requested to co-operate with the TTD. Elaborate food, water arrangements will be made during these three important days. While the garden and electrical wings will come out with floral decorations and electrical illumination for the festivities”, he added.

CVSO Sri A Ravikrishna, Tirupati Urban SP Sri Abhishek Mohanty, FACAO Sri O Balaji, Additional CVSO Sri Siva Kumar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Sri Venkateswarulu, APSRTC RM Sri Nagasivudu, GM Sri Sesha Reddy and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 సందర్భంగా భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

డిసెంబరు 12, తిరుమల 2017; డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశి, 2018, జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టిటిడిలోని వివిధ విభాగాల అధికారులు, పోలీసులు, ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా డిసెంబరు 28 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆర్జితసేవలను, దివ్యదర్శనం టోకెన్లను రద్దు చేశామని తెలిపారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవని తెలియజేశారు. డిసెంబరు 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తామని, కంపార్ట్‌మెంట్లు నిండిన తరువాత వచ్చే భక్తుల కోసం ఆళ్వార్‌ ట్యాంకు, నారాయణగిరిఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2, కర్ణాటక సత్రాలు, మేదరమిట్ట, ఉత్తర మాడ వీధి పైభాగాన, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్‌ రోడ్డు వరకు క్యూలైన్లు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. డిసెంబరు 29వ తేదీన వైకుంఠ ఏకాదశి శుక్రవారం కావడంతో అభిషేకం, ధనుర్మాస పూజల కారణంగా భక్తులకు సర్వదర్శనం సమయం 4 గంటల పాటు తగ్గిందన్నారు. ఉదయం 5.30 గంటలకు బ్రేక్‌ దర్శనం ప్రారంభమవుతుందని, ఉదయం 8 గంటలకు సర్వదర్శం ప్రారంభిస్తామని తెలియజేశారు.

డిసెంబరు 28న కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుందని, ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానుసారం అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామని జెఈవో తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం అవకాశమున్న చోట తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 4 లక్షల తాగునీటి ప్యాకెట్లు, ఒక లక్ష మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకుంటామన్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠద్వారం, తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు చేపడతామని, క్యూలైన్ల వద్ద పూర్తిస్థాయిలో విద్యుదీకరణ చేస్తామని తెలిపారు.

రాజ్యాంగపరమైన హోదాలలో ఉన్నవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం, వసతి ఏర్పాట్ల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని జెఈవో వెల్లడించారు. మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాలోని సీనియర్‌ జ్యుడిషియల్‌ అధికారులకు వెంకటకళా నిలయంలో, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఏలు, ఎంపిలకు రామరాజ నిలయం, సీతా నిలయంలో, అఖిలభారత సర్వీసుల అధికారులకు సన్నిధానంలో, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్‌ విశ్రాంతిగృహంలో కౌంటర్లు ఏర్పాటుచేసి దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. రాజ్యాంగపరమైన హోదాలోనివారు స్వయంగా విచ్చేసిన పక్షంలో వారితోపాటు ఐదుగురికి, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు, ఇతర అధికారులు స్వయంగా వచ్చిన పక్షంలో వారితోపాటు ముగ్గురికి దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ప్రముఖులు మరియు భక్తులందరూ సంయమనంతో వ్యవహరించి టిటిడికి సహకరించాలని జెఈవో విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు జరిగిన సమీక్షలో భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏర్పాట్లుచేయాలని అధికారులను జెఈవో ఆదేశించారు. శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌, సెక్యూరిటీ, పోలీస్‌ అధికారులు సమన్వయం చేసుకుని భక్తులందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆకర్షించేలా పుష్పాలంకరణ చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. భక్తులకు సరిపడా లడ్డూలను నిల్వ ఉంచుకోవాలని, టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులకు తెలిసేలా రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ శాఖ ద్వారా అనౌన్స్‌మెంట్‌లు ఇవ్వాలన్నారు. శాఖలవారీగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జెఈవో పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, అర్బన్‌ ఎస్‌పి శ్రీ అభిషేక్‌ మహంతి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఆర్‌టిసి ఆర్‌ఎం శ్రీ నాగశివుడు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీశేషారెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మి, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ రాజేంద్రుడు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.