VAIKUNTADWARA DARSHANAM FROM DECEMBER 23 TO JANUARY 1- TTD EO _ వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

TIRUMALA, 01 DECEMBER 2023: TTD will be providing Vaikuntha Dwara Darshanam to Srivari devotees from December 23 to January 1, said TTD EO Sri AV Dharma Reddy.

Before taking the calls from pilgrims during the monthly Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO briefed the pilgrims on upcoming festivities, development activities and other important programmes.

Some excerpts:

TTD is organising the Ten-day Vaikuntadwara Darshan for devotees from December 23 to January 1. Elaborating on the importance of the ten-day Vaikunthadwara Darshan he said, six months of Uttarayana period is considered 12 hours in the Morning in Vaikuntham the abode of Sri Maha Vishnu while the remaining six months of Dakshinayana is considered to be 12 hours of Night. The period of ten days in Dhanurmasam is equivalent to 40 minutes in Vaikuntham as mentioned in the sacred texts of Hindu Sanatana Dharma.  During this time, Sri Maha Vishnu attends the court and provides darshan to His devaganas (here devotees) which is equal to ten days of Vaikunthadwara Darshanam. So all these ten days are considered sacred, he maintained.

The EO said, already 2.25 lakh ₹300 special Darshan tickets, 20000 SRIVANI tickets were released online for ten days. While other 4.23lakh tokens will be issued by TTD in the counters at ten places in Tirupati as in last year. The mode of issuing tokens is being negotiated, he added.

TTD has cancelled privileged Darshan to senior citizen, challenged persons, NRI, defence services etc on these ten days.

From December 22-24 and December 31- January 1 TTD has cancelled all arjita Sevas like Kalyanotsavam,Unjal Seva and arjita Brahmotsavam. All these Sevas will be performed in Ekantham from December 25-30.

Sahasra Deepalankara Seva will be conducted in Ekantham from December 23- January 1.

On Ekadasi day Vishnu Sahasranama Parayanam will be conducted at the Nada Niranjanam platform and in view of Gita Jayanti, Bhagavad Gita Parayanam will also be held same day.

Karthika Masa Mahotsavams

Karthika Vana Bhojanam will be held on December 3 at Paruveta Mandapam in Tirumala.

Rudrabisekam began on November 14 at SV Vedic University ane will continue till December 12.

Homa Mahotsavam began at Sri Kapileswara Swamy temple from November 24 and will continue till December 12.
 
On December 28 Pranaya Kalaha Mahotsavam will be observed at Tirumala.

Introduced Caution Deposit Refund Tracker for the benefit of devotees to track the position of refund of caution deposit refunds due to them.

JEO(H&E) Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

– ధనుర్మాసంలో డిసెంబరు 17 నుండి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 డిసెంబరు 01: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నాం.

ఆన్‌లైన్‌ దర్శన టికెట్ల వివరాలు

– 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.

– రోజుకు 2000 టికెట్లు చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను కూడా నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.

ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల వివరాలు

– తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తాం.

– తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటుచేస్తాం.

భక్తులకు విజ్ఞప్తి

– దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరడమైనది.

శ్రీవారి ఆలయం

– డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేయడమైనది. ఈ సేవలను డిసెంబరు 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది.

– డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తాం.

– వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

– వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.

– నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుంది. అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండపారాయణం నిర్వహిస్తాం.

కార్తీక మాస ఉత్సవాలు

– తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ధ్యానారామంలో నవంబరు 14న ప్రారంభమైన రుద్రాభిషేకం డిసెంబరు 12వ తేదీ వరకు జరుగుతుంది.

అధ్యయనోత్సవాలు

– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 12వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ధనుర్మాసం ప్రారంభం

– డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాశురాల పారాయణం నిర్వహించి భక్తులందరూ పఠించేలా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

గీతాజయంతి

– తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో డిసెంబరు 23న గీతాజయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తాం.

ప్రణయకలహ మహోత్సవం

– డిసెంబరు 28న తిరుమలలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తాం.

భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

– 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌

– తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్‌ డిపాజిట్‌ ప్రస్తుతస్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ను పొందుపరిచాము. భక్తులు గది బుక్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అకామడేషన్ – బుకింగ్‌ హిస్టరీ – ఆఫ్‌లైన్‌ అకామడేషన్‌ సిడి రీఫండ్‌ ట్రాకర్‌ను క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

నవంబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 19.73 లక్షలు

హుండీ :

– హుండీ కానుకలు – రూ.108.46 కోట్లు

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 97.47 లక్షలు

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 36.50 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 7.06 లక్షలు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.