CHAKRASNANAM HELD _ శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

Tirumala, 14 Jan. 22: Chakrasnanam was held with religious fervour in Tirumala on Friday.

 

The Sudarshana Chakrattalwar was brought to Sri Bhu Varaha Swamy temple between 5am and 6am and Snapana Tirumanjanam was performed amidst chanting of Vedic hymns and Chakrasnana Mahotsavam was performed.

 

TTD EO Dr KS Jawahar Reddy, CVSO Sri Gopinath Jatti, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 14: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్ర‌వారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుండి 6 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.

శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.