VAIKUNTHA DWARA DARSHAN IN TIRUMALA FROM JAN 2-11 _ దర్శన టోకెన్‌ ఉన్న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు 

OVER 90 COUNTERS IN TIRUPATI TO ISSUE SSD TOKENS

ARRANGEMENTS TO PROVIDE DARSHAN TO EIGHT LAKH DEVOTEES IN TEN DAYS

TICKETS OR TOKENS MUST FOR DEVOTEES TO HAVE VAIKUNTHA DWARA DARSHAN -TTD EO

TIRUMALA, 26 DECEMBER 2022: With an aim to facilitate Vaikuntha Dwara Darshan to more number of devotees, the TTD board has resolved to open the Vaikuntha Dwara Darshan for ten days, said TTD EO(FAC) Sri Anil Kumar Singhal.

After inspecting the ongoing arrangements for Vaikuntha Dwara Darshan in Tirumala on Monday, Sri Singhal said, earlier, since the Vaikuntha Dwara Darshan used to be only on Vaikuntha Ekadasi and Dwadasi, TTD could able to provide the Dwara Darshan to only limited number of pilgrims a day, though tens of thousands of devotees remain stranded waiting for over 30hours. But with this pilgrim-friendly decision by the TTD board to open the Vaikuntha Dwaram for ten days, now we can provide darshan to nearly 80 thousand devotees each day, thereby facilitating almost eight lakh devotees to have Vaikuntha Dwara Darshan”, he observed.

The EO said, the Vaikutha Dwara Darshan for devotees will be open between January 2 to January 11. To avoid long waiting hours, the TTD board has decided to allow the devotees with specified time slots to have hassle-free darshan. 

In Tirupati, nine centres with almost 100 counters would be set up and SSD tokens will be issued to the devotees for Vaikuntha Dwara Darshan. 

Adding further the EO (FAC) said for the sake of devotees to have a smooth darshan without waiting, they are requested to come to Tirumala in their allotted time slots only. Due to limited accommodation, only those with tokens or tickets of darshan will alone be allotted accommodation in Tirumala on a first come first serve basis”, he maintained.

“We give wide publicity to the devotees on darshan updates through TTD website, SVBC etc. The devotees are requested to plan their Tirumala visit based on the availability of tokens only. When we released 2lakh Special Entry Darshan tickets(Rs.300) on-line, they got booked within 44 minutes. As many as 31 lakh hits were recorded to book SED tickets across the country, which clearly shows the demand”, he said. 

All the departments in TTD including Annaprasadam, Health, Transport etc. have been making elaborate arrangements for the upcoming Vaikuntha Dwara Darshan.

Earlier he inspected Krishna Teja Rest House Circle, Narayanagiri Gardens, ATC Circle to verify the entry and gave necessary instructions to the officials concerned to make arrangements accordingly.

Additional EO(FAC) Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, GM Transport Sri Sesha Reddy, Health Officer Dr Sridevi, Special Officer Annaprasadam Sri Shastry, DSP Tirumala Sri Venugopal and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

దర్శన టోకెన్‌ ఉన్న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు 
 
– తిరుపతిలో 9 ప్రాంతాల్లో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ
– టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
 
తిరుమల, 26 డిసెంబరు, 2022: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. 
 
వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300/` ఎస్‌ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో 
జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 
 
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు.
 
ఈవో వెంట అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌,  ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్ పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితరులు ఉన్నారు. 
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.