VAIKUNTHA NARAYANA ON PEDDA SESHA _ పెద్దశేష వాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో సిరులతల్లి

TIRUPATI, 21 NOVEMBER 2022: Goddess Sri Padmavathi as Vaikuntha Narayana blessed Her devotees along the four Mada streets as a part of ongoing Karthika Brahmotsavams in Tiruchanoor on Monday.

On the second day morning, the Goddess took out a celestial ride on the seven hooded Pedda Sesha Vahanam amidst the royal entourage of Radha, Gaja, Turaga, Padadi Dalams-the colourful paraphernalia and glided along the Mada streets surrounding the shrine in Tiruchanoor. 

Devotees offered Haratis in all the Harati points during the Vahana Seva that held between 8am and 10am.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పెద్దశేష వాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో సిరులతల్లి
 
తిరుపతి, 2022 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ  నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
 
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
 
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
 
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయర్‌స్వామి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ  డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.