“VAIKUNTHAM DWARAM”TO BE RECREATED IN SRINIVASAMANGAPURAM _ శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

Tirupati, 26 December 2017: TTD is all set to celebrate the most auspicious event in Dhanurmasam, the Vaikuntha Ekadasi in a big way in its sub-temples located in and around Tirupati on December 29.
In this connection a review meeting by Tirupati JEO Sri P Bhaskar was held in Srinivasa Mangapuram temple on tuesday.

ERECTION OF VAIKUNTHA LOKA THEME:

Reviewing the arrangements for the mega religious event, the JEO instructed the temple, engineering, vigilance, officials to make the arrangements on par with Tirumala shrine by setting up Vaikuntha Dwaram in the temple.
He has instructed the Engineering, electrical and garden wings to come out the most attractive displays to give aesthetic experience to the multitude of devotees who throng the temple on these twin occasions.

REVERED AS “MINI TIRUMALA” :

Popularly known as Mini Tirumala, the Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram is equally popular to the hill shrine of Tirumala and has a mythological significance of the abode that was being visited by none other than Lord Sri Venkateswara Himself soon after His celestial wedding with Goddess Padmavathi. So the presiding deity of this temple is famous by name Sri Kalyana Venkateswara Swamy.Temple DyEO Sri Venkataiah and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో

తిరుపతి, 26 డిసెంబరు 2017 ; టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం ఏర్పాట్లను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పరిశీలించారు. టిటిడి అధికారులతో కలసి జెఈవో మంగళవారం ఉదయం ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ డిసెంబరు 29, 30వ తేదీల్లో ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. డిసెంబరు 30న ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌ను నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు. ఆలయంలో భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సులభంగా గుర్తించేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో శ్రీవారి కైంకర్యాలు, దర్శనాల వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ప్రదర్శించాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌, తాగునీరు, ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, పౌరాణికాంశాల సెట్టింగులు ఏర్పాటుయాలని ఆదేశించారు.

తిరుపతి జెఈవో వెంట టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఈఈ శ్రీ మనోహరం, డిపిపి సెక్రటరీ శ్రీ రామకృష్ణారెడ్డి, సిఎంవో డా|| నాగేశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ కె.ధనుంజయ, విజీవో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఆలయ ఏఈవో శ్రీధనుంజయ తదితర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.