VAIKUNTHANADHA ON PEDDASESHA _ పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 29 FEBRUARY 2024: On the first day evening of the annual Brahmotsavam at Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara took out a celestial ride on the seven-hooded Pedda Sesha Vahanam as Vaikunthanadha.

The cultural troupes and paraphernalia added glamour and glitter to the ceremonious procession.

Devotees were thrilled to see the charm of the entire event.

Special Grade DyEO Smt Varalakshmi and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 29 ఫిబ్రవరి 2024: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల