VAKULAMATA REST HOUSE AND NEW PAC OPENED_ మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 2 Oct. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy inaugurated the new Matrusri Vakulamata Rest House constructed at a cost of Rs.42.86crores on Wednesday in Tirumala.

This five-storied complex has 54 rooms in each floor and accommodates 1400 devotees.

Later the Chairman also laid foundation stone to PAC 5 located on the back of Govardhan Choultry (PAC 1) at Tirumala. 

The complex will come up at a cost of Rs.79crores and will be constructed in one and a half year’s time.

Speaking to media persons he said, the Honourable CM of AP Sri YS Jagan Mohan Reddy has instructed to open the Vakulamata Rest House to cater to the needs of pilgrims during Brahmotsavams. Both the rest houses will reduce the accommodation woes of devotees in future, he added. 

Additional EO Sri AV Dharma Reddy,  Tirupati JEO Sri P Basant Kumar, CE Sri Ramachandra Reddy,  SEs Sri Ramesh Reddy,  Sri Sriramulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్‌

  అక్టోబరు 02, తిరుమ‌ల‌, 2019:   శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో నిర్మించిన మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు.

 ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు వ‌స‌తిప‌రంగా ఇబ్బందులు లేకుండా ఈ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 1.86 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.42.86 కోట్లతో ఈ భ‌వ‌నాన్ని నిర్మించామ‌న్నారు. ఒక్కో ఫ్లోర్లో 54 గదులతో 5 ఫ్లోర్లలో 270 గదులను 1400 మంది భ‌క్తులు వినియోగించుకునేలా నిర్మించిన‌ట్టు తెలిపారు. 2 లిఫ్ట్ లు, కారు పార్కింగ్ సౌకర్యం ఉంద‌న్నారు.

పిఏసి -5 ప‌నుల‌కు శంకుస్థాప‌న

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గోవర్థన్ చౌల్ట్రీ పక్కన రూ.79 కోట్లతో 2.89 లక్షల చదరపు అడుగులలో నిర్మించ‌నున్న యాత్రికుల వసతి సముదాయం-5 పనులకు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శంకుస్థాప‌న చేశారు.

 ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో దాదాపు 18 నెలల కాలంలో ఈ పనులను పూర్తి చేస్తామ‌న్నారు. ఇక్క‌డ అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ, పార్కింగ్‌ వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. దాదాపు 5 వేల మందికి స‌రిప‌డా డార్మిటరీలు నిర్మిస్తామ‌ని, భ‌క్తులు గ‌దుల కోసం వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా ఇక్క‌డ లాక‌ర్లు, స్నాన‌పుగ‌దులు ఉంటాయ‌ని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.