Valedictory function of Archaka Training programme _ భారతీయ సంస్కృతిలో అర్చకులకు ఒక విశిష్ట స్థానం : శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు
SVETA Director Sri Bhuman, TTD Agama Advisor Dr Vishnu Bhattacharya, Spl Office Sri Chenchu Subbaiah and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భారతీయ సంస్కృతిలో అర్చకులకు ఒక విశిష్ట స్థానం : శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు
తిరుపతి, జూన్-27, 2009: భారతీయ సంస్కృతిలో అర్చకులకు ఒక విశిష్ట స్థానం ఉందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక శ్వేతనందు జరిగిన అర్చక శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భిన్న సంస్కృతులతో, జాతుల సమన్వయంతో, మధనంలా జరిగిన అతిగొప్ప సంస్కృతితో కూడినదే హిందూమతమని ఆయన చెప్పారు. హిందూమతానికి దేవాలయాలు, పూజారులు ప్రాణం లాంటివని, దేశం సుభిక్షంగా ఉండాలంటే దేవాలయాలు, అర్చకులు బాగావుండాలని తెలిపారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారికి వ్యవహారాలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని పునశ్చరణ తరగతులద్వారా మరికొంత మంచి సమాచారం పండితుల ద్వారా చెప్పడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా దళిత,గిరిజన పూజారులకు సైతం శిక్షణా తరగతులను నిర్వహించి తద్వారా హైందవ ధర్మాన్ని గ్రామస్థాయిలో బాగా ప్రచారం చేయడానికి అవకాశముంటుందని ఆయన చెప్పారు.
పాంచరాత్ర ఆగమం 5రోజుల పాటు జిరిగిన ఈ పునశ్చరణ తరగతులనందు అర్చన, సంకల్పం,ధ్యాన శ్లోకములు, ప్రాయశ్శిత్తములు, ఆగమాలు, పాంచరాత్రం ఆలయనియమావళి, ఉచ్ఛారణ తదితర విషయాలపై అర్చక శిక్షణ జరిగింది.
ఈ కార్యక్రమంలో తితిదే శ్వేతడైరెక్టర్ శ్రీభూమన్, శ్రీకె.జె.కృష్ణమూర్తి, కర్నాటక రాష్ట్రం నుండి వచ్చిన దాదాపు 37 మంది అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.