మార్చి 19, తిరుపతి, 2019: మార్చి 21 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ
మార్చి 19, తిరుపతి, 2019: మార్చి 21 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ
టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మార్చి 21 నుండి 24వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి.
మార్చి 21న సాయంత్రం 6 గంటలకు ఆచార్య వరణం, విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, వాస్తుహోమం, అంకురార్పణం నిర్వహిస్తారు.
మార్చి 22న ఉదయం 7 గంటలకు మహాకుంభానికి కళాకర్షణం చేస్తారు. ఆ తరువాత ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, బింబకుంభ మండల అగ్ని ఆరాధన, పూర్ణాహుతి చేపడతారు.
మార్చి 23న ద్వారతోరణాది అర్చన, పూర్ణాహుతి, 81 కలశాలతో కర్మాంగ స్నపనం, శయనాధివాసం నిర్వహిస్తారు.
మార్చి 24న ఉదయం 7 గంటలకు ప్రాణప్రతిష్ఠ ఆవాహనం, ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 9.45 గంటలకు మహాసంప్రోక్షణ, చతుర్వేద విన్నపం, దివ్యప్రబంధ శాత్తుమొర తదితర కార్యక్రమాలు చేపడతారు.
టిటిడి శ్రీనివాసమంగాపురం గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ కె.ధనంజయుడు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.