VALMIKIPURAM GEARS UP FOR BTUs_ మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

EO RELEASES WALL POSTERS

Tirupati, 11 March 2018: The annual brahmotsavams in TTD sub-shrine of Sri Pattabhi Ramalayam in Valmikipuram will be observed from March 23 to 31.

TTD EO Sri Anil Kumar Singhal released the posters for the same in his chambers in TTD administrative building on Sunday.

The important days includes Dhwajarohanam on March 23, Hanumantha Vahanam on March 24, Kalyanotsavam and Garuda Seva on March 28, Radhotsavam on March 29 and Vasanthotsavam, Chakrasnanam and Dhwajavarohanam on March 31.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

మార్చి 11, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదివారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలిలా ఉన్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

23-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం గజ వాహనం

24-03-2018(శనివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
25-03-2018(ఆదివారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

26-03-2018(సోమవారం) సర్వభూపాల వాహనం పెద్దశేష వాహనం

27-03-2018(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 28-03-2018(బుధవారం) తిరుచ్చి ఉత్సవం కల్యాణోత్సవం, గరుడసేవ

29-03-2018(గురువారం) రథోత్సవం ధూళి ఉత్సవం

30-03-2018(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం, పార్వేటఉత్సవం

31-03-2018(శనివారం) వసంతోత్సవం/చక్రస్నానం హంస వాహనం, ధ్వజావరోహణం

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఏఓ శ్రీ రవిప్రసాదు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, బోర్డు సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.