VARA LAKSHMI VRATAM ON AUGUST 5 _ ఆగ‌స్టు 5న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం

OPPORTUNITY FOR DEVOTEES IN BOTH DIRECT AND VIRTUAL MODES -JEO

 Tirupati, 25 July 2022: TTD is making arrangements to organise Varalakshmi vratam fete at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on August 5.

This religious event is all set to be observed with the participation of the devotees after two years gap due to Covid-19 pandemic.  TTD, also has given an opportunity of direct or virtual participation for the benefit of devotees.

Speaking after a review meeting on the arrangements for the annual fete at the Asthana Mandapam in Tiruchanoor on Monday, the TTD JEO Sri Veerabrahmam said keeping in view of pilgrim turnout this year, both the online and offline issue of tickets will be issued for the devotees.

Among other arrangements, he directed officials to make spectacular flower and electrical decorations at Sri Padmavati temple and Asthana Mandapam besides SVBC live cast of the celestial fete.

SEs Sri Satyanarayana, Sri Venkateswarlu, Transport GM Sri Sesha Reddy, Temple DyEO Sri Lokanatham, Agama Advisor Sri Srinivasacharyulu, AEO Sri Prabhakar Reddy, VGO Sri Manohar, temple Archaka Sri Babuswami and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

ఆగ‌స్టు 5న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం

– నేరుగాను, వ‌ర్చువ‌ల్‌గాను పాల్గొనే అవ‌కాశం

– భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు

– జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 జూలై 25: భార‌తీయులు అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించే ప‌ర్వ‌దినాల్లో ఒక‌టైన వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఆగ‌స్టు 5వ తేదీ శుక్ర‌వారం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఏర్పాట్ల‌పై సోమ‌వారం జెఈవో తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంలో పాల్గొనే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఆల‌యంలో ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. భ‌క్తులు నేరుగాను, వ‌ర్చువ‌ల్ గాను వ్ర‌తంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు జారీ చేస్తామ‌న్నారు. ఆల‌యం, ఆస్థాన మండ‌పంలో వివిధ ర‌కాల పుష్పాలలు, విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రిస్తార‌న్నారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్నిఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు.

ఎస్ఇలు శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ర‌వాణావిభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇఇలు శ్రీ న‌ర‌సింహ‌మూర్తి, శ్రీ మ‌నోహ‌ర్‌, స్థానిక సి ఐ శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి , ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.