VARAHA JAYANTI OBSERVED _ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 17 September 2023: The Varaha Jayanthi was solemnly celebrated on Sunday at Sri Bhu Varahaswamy temple in Tirumala.

 

As a part of this, in the morning Kalasa Sthapana, Kalasa Pooja and Punyahavachan were rendered. 

 

After that, special Abhishekam with milk, curd, honey, coconut water, turmeric and sandalwood was done amidst chanting Veda mantras by Parayanamdars.

Temple Deputy EO Sri Lokanadham and others participated in this program.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2023 సెప్టెంబరు 17: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.