VASANTHOTSAVAM AT TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరులో రెండో రోజు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tiruchnoor, 26 May 2021: On the second day of the ongoing annual Vasantothsavam festivities at Sri Padmavati Ammavaru temple on Wednesday Snapana Tirumanjanam was held in Ekantam as per Covid guidelines.

The celebrations included Bangaru Tiruchi utsava in place of Bangaru Ratham in the morning followed by Snapana Tirumanjanam for utsava idols of Padmavati Devi at Ashirvachana mandapam in the afternoon.

Later in the evening, Ammavari procession was held amidst Veda Parayanams and Mangala vaidyam.

Temple DyEO Smt Kasturi Bai, Agama Advisor Sri Srinivasa Charyulu, AEO Sri Prabhakar Reddy, Temple Archaka Sri Babuswami, Superintendent Sri Madhu and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో రెండో రోజు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి, 2020 మే 26: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.

వసంతోత్సవాల్లో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారు ర‌థం బ‌దులు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం జ‌రిగింది. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేద పారాయ‌ణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ధు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.