VASANTHOTSAVAM COMMENCES _ వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

FRIDAY GARDENS SPRUCES UP FOR THE OCCASION
 
TIRUPATI, 22 MAY 2024: The annual three-day Vasanthotsavam commenced on a grand religious note in Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Wednesday.
 
The religious event was observed from 2.30pm pm to 4:30pm in Friday Gardens. The entire premises has been spruced up recreating a green wood environment with various flora and fauna hanging from atop enhancing the grandeur of the event.
 
Later the utsava deity of Ammavaru was rendered Abhishekam with turmeric, vermilion, milk, curd, honey, sandal paste, coconut water.
 
In the evening the Goddess will be paraded along four mada streets.
 
DyEO Sri Govindarajan, Archaka Sri Babu Swamy, Superintendent Sri Seshagiri, temple inspector Sri Ganesh and others, Grihasta devotees were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

– మే 23న స్వర్ణరథోత్సవం

తిరుపతి, 2024 మే 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 23న ఉదయం ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.

వైభవంగా స్నపనతిరుమంజనం…

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గ‌ణేష్‌, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.