VASANTHOTSAVAMS IN PAT _ మే 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

TIRUPATI, 28 APRIL 2024: The three day annual Vasanthotsavams will be observed in Tiruchanoor temple from May 22-24 with Ankurarpanam on May 21 and Koil Alwar Tirumanjanam on May 14.

The devotees willing to participate in Sri Padmavati Ammavari Vasanthotsavams shall pay Rs.150 per ticket on which two persons will be allowed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

•⁠ ⁠మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2024 ఏప్రిల్ 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 14వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 14 మ‌రియు మే 21 నుండి 24వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 23న తిరుప్పావ‌డ సేవ‌, మే 24న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.