VATAPATRA SAI CHARMS ON CHANDRAPRABHA _ చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tirumala, 14 OCTOBER 2021: On the Seventh-day evening as a part of the ongoing annual Brahmotsavam at Tirumala, Sri Malayappa Swamy as Vatapatrasai mused His devotees on Chandra Prabha Vahanam.

 

Chandra with his graceful cool rays provides a soothing feel to the living beings on earth. With the presence of Sri Malayappa on Chandraprabha, the devotees experienced an enhanced chill thrill.

 

Both the Pontiffs of Tirumala, Deputy Speaker Sri K Raghupati, EO Dr KS Jawahar Reddy, Board Members Smt Prasanthi Reddy, Sri Pokala Ashok Kumar, Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమ‌ల‌, 2021 అక్టోబరు 13: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వటపత్రశాయి అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై దర్శనమిచ్చారు.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ పోకల అశోక్ కుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.