VEDA PARAYANAM PROGRAMME ON SVBC DURING CORONA TIME IS PRAISE WORTHY-PILGRIM CALLERS _ శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం పంపిణీ కొన‌సాగించాలి భ‌క్తుల విజ్ఞ‌ప్తి

Tirumala, 14 Jun. 20: The religious programmes including Veda Parayanam, Dhanwantari Maha Mantra Parayanam etc.by TTD especially when the entire world is facing the threat from dreadful Corona COVID 19 virus is praiseworthy, complemented pilgrim callers.

The Dial Your EO programme held for the first time after a gap of four months due to Corona lockdown restrictions, on Sunday at Annamaiah Bhavan in Tirumala on trial-basis instead of first Friday. During this programme, 14 callers had interacted with TTD EO Sri Anil Kumar Singhal to give their feedback and suggestions. 

Callers Sri Sastry, Sri Ramalingeswara Rao from Tanuku, Sri Manohar from Tirupati lauded TTD efforts in arranging Vedaparayanam at NadaNeerajanam platform in Tirumala. They sought TTD to continue the programme forever. They also suggested TTD to organise Homams to ward off ill effects of Corona. Thanking the callers, TTD EO said, TTD has been organising several Homams and Parayanams since March. “We have conducted Dhanwantari Homam, Japa Yagnam, Yoga Vasishtyam in the last two months and now commenced Sundara Kanda Pathanam to overcome the ongoing Corona crisis across the world. We have been receiving emails from devotees of Srivaru across the globe for organizing the Veda Parayanam and telecasting live on SVBC during this hightime.

Callers Sri Ravi from Anantapur, Appanna from Visakhapatnam, Sri Siva Prasad from Chirala, Sri Uma Maheswara Rao from Hyderabad sought EO to think of sending pilgrims closure to Lord and also enhance the quota of online darshan tickets. Answering the callers, the EO said, the darshan for pilgrims has been stalled owing to Corona lockdown for nearly 80 days. After that we have resumed darshan for pilgrims from June 11 onwards. Now the devotees are having pleasant darshan without push and pull as we are allowing just 500 pilgrims per hour as against 5000 which used to be earlier in view of prevailing lockdown restrictions.

However we can think of enhancing the online quota based on the instructions we receive from Central and State governments from time to time, he added.

A caller Sri Purandharachari from Karimnagar sought EO solution to fulfil the tonsuring vow of his three year old child as TTD has restricted the entry for pilgrims below 10years and above 60years. In a reply to the query, EO said, in the existing circumstances, TTD cannot allow the pilgrims below and above the specified age groups as it is a directive from Central Government as CoronaVirus is more rampant in these age groups. “Keeping in view the health safety of all we have to abide by the rules”, he said.

Another caller Smt Sveta from Karimnagar sought EO, the process of receiving the refund for the darshan ticket which they had booked in May from e-Darshan counter. EO said, the refund will be arranged by the concerned department.

Sri Suman from Hyderabad sought EO to place rooms with higher tariffs also online as TTD has withdrawn many rooms in the tariffs over 1000 since six months. He also complained of poor maintenance of the rooms in Tirumala. Answering the pilgrim caller, EO said, as most of the pilgrims are not vacating the rooms in higher tariff in the stipulated time, TTD has decided to withdraw the rooms with higher tariffs booking online. “We have many rooms which are available below 500 but only limited rooms above 1000 tariff. So we have taken this decision. Reacting on room maintenance, the EO said, a couple of years ago an amount of Rs.110crore towards the improvement of rooms in Tirumala was sanctioned by TTD Board. We have already commenced the repair works six months ago. However due to Corona lockdown, the works were interrupted and we have resumed now”, he said.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramachandra Reddy and others officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం పంపిణీ కొన‌సాగించాలి 

భ‌క్తుల విజ్ఞ‌ప్తి

తిరుమల, 14 జూన్‌ 2020: తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆదివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు.

1. అప్ప‌న్న – విశాఖ‌, ర‌వి – అనంత‌పురం.

ప్రశ్న: స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఆన్‌లైన్లో ఇవ్వాలి. భ‌క్తులు తిరుప‌తికి వ‌చ్చి ఇబ్బంది ప‌డుతున్నారు. జిల్లాల్లో శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం పంపిణీ కొన‌సాగించాలి. భౌతిక‌దూరం పాటిస్తూ ఆర్జిత సేవ‌ల‌కు కొంత‌మంది భ‌క్తుల‌నైనా అనుమ‌తించాలి.

ఈవో : దూర‌ప్రాంతాల వారు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే ద‌ర్శ‌నానికి రావాలి. తిరుప‌తిలో ప్ర‌స్తుతం రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు మాత్ర‌మే జారీ చేస్తున్నాం. ద‌ర్శ‌నం టికెట్లు గంట‌కు మ‌రో 250 దాకా పెంచాల‌ని స‌ల‌హాలు వ‌స్తున్నాయి. బోర్డు ఛైర్మ‌న్‌తో చ‌ర్చించి ప‌రిస్థితులను బట్టి నిర్ణ‌యం తీసుకుంటాం. ఆల‌యంలో స్థ‌లాన్ని బ‌ట్టి భౌతిక‌దూరం పాటిస్తూ ఆర్జిత‌సేవ‌ల‌కు ఎంత‌మంది భ‌క్తుల‌ను అనుమ‌తించాలో ప‌రిశీలిస్తాం. ప్ర‌భుత్వ అనుమ‌తి వ‌చ్చాకే ఆర్జిత సేవ‌ల‌ను ప్రారంభిస్తాం.

2. మోహ‌నకృష్ణ – క‌డ‌ప‌

ప్రశ్న: ల‌క్కీడిప్ ద్వారా చాలాసార్లు ప్ర‌య‌త్నించినా సేవాటికెట్లు దొర‌క‌లేదు. తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ ద్వారా ఇచ్చే సేవాటికెట్ల సంఖ్యను పెంచండి. వైకుంఠ ఏకాద‌శి రోజున ఒక‌సారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన వారు 3 నుంచి 5 ఏళ్ల పాటు మ‌ళ్లీ రాకుండా చ‌ర్య‌లు చేప‌డితే అంద‌రికీ ద‌ర్శ‌న ల‌భిస్తుంది.

ఈవో : ల‌క్కీడిప్‌లో 40 శాతం మందికి తొలిసారి సేవాటికెట్లు ల‌భిస్తున్నాయి. ఎక్కువ‌సార్లు ప్ర‌య‌త్నిస్తే అవ‌కాశం ల‌భిస్తుంది. వైకుంఠ ఏకాద‌శికి భ‌క్తుల‌ను నియంత్రించ‌లేము. ఇందుకోసం ఆధార్ కార్డును ఉప‌యోగిస్తే కొన్ని వివాదాలు ఏర్ప‌డే అవ‌కాశముంది.

3. శివ‌ప్ర‌సాద్ – చీరాల‌

ప్రశ్న: భ‌క్తులు ఒక‌ప్పుడు స్వామివారిని ద‌గ్గ‌ర‌గా ద‌ర్శ‌నం చేసుకునేవారు. ఇప్పుడు చాలాదూరం నుంచి ద‌ర్శ‌నం చేసుకోవాల్సి వ‌స్తోంది. సంపూర్ణంగా స్వామివారిని చూడలేక‌పోతున్నాం.‌

ఈవో : భ‌క్తుల సంఖ్య వేలాదిగా పెరుగుతున్నందు వ‌ల్ల అంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికే మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం అమ‌లుచేస్తున్నాం. ప్ర‌స్తుతం భ‌క్తులు 5 నుంచి 10 సెక‌న్ల పాటు స్వామివారిని సంతృప్తిగా ద‌ర్శించుకుని వెళుతున్నారు.

4. పురంధ‌రాచారి – క‌రీంన‌గ‌ర్‌

ప్రశ్న: ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పుట్టువెంట్రుక‌ల మొక్కు చెల్లించాలంటే ఎలా?

ఈవో : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 65 ఏళ్లు పైబ‌డిన‌వారిని, 10 ఏళ్ల‌లోపు పిల్ల‌ల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేదు.

5. ఉమామ‌హేశ్వ‌ర‌రావు – హైద‌రాబాద్‌

ప్రశ్న: శ్రీ‌వారి ఏకాంత సేవ‌ను ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. సిబ్బంది అడ్డుగా వ‌స్తుండ‌డం వ‌ల్ల సేవ‌ను స‌రిగా చూడ‌లేక‌పోతున్నాం. ల‌క్కీడిప్ ద్వారా కేటాయించే టికెట్ల సంఖ్య‌ను పెంచాలి.

ఈవో : ఏకాంత సేవ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారంలో సిబ్బంది అడ్డురాకుండా త‌గిన ఆదేశాలిస్తాం. క‌రోనా నుంచి ప‌రిస్థితి పూర్తి అదుపులోకి వ‌చ్చాక బోర్డుతో చ‌ర్చించి టికెట్ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంటాం.

6. శాస్త్రి, – అశోక్ – అదిలాబాద్‌

ప్రశ్న: ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల్లో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ప‌రిమితంగా భ‌క్తుల‌ను పంప‌డం మంచిది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి.

ఈవో : ధ‌న్యవాదాలు. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి అనేక య‌జ్ఞాలు, యాగాలు నిర్వ‌హించింది. తిరుమ‌ల‌లో 62 రోజుల పాటు నిర్వ‌హించిన యోగవాశిస్టం – ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణాన్ని ల‌క్ష‌లాది మంది భ‌క్తుల అనుస‌రించారు. రెండు రోజులుగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం జ‌రుగుతోంది. భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వీడియోలు ఎస్వీబీసీ వెబ్‌సైట్‌, యుట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

7. శ్వేత – విజ‌య‌న‌గ‌రం

ప్రశ్న: మే నెల‌లో ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నాం. వాటిని ఎలా ర‌ద్దు చేయాలో తెలియ‌లేదు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌‌లో టికెట్లు దొర‌క‌డం లేదు.

ఈవో : మీ టికెట్ల‌కు సంబంధించిన సొమ్ము రీఫండ్ అయ్యే ఏర్పాటు చేస్తాం. ప‌రిస్థితి బాగుంటే జూలై నెల‌లో ద‌ర్శ‌నం టికెట్ల సంఖ్య పెంచుతాం. అప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి రావ‌చ్చు.

8. సుమన్ – హైదరాబాద్‌

ప్రశ్న: లాక్‌డౌన్ త‌రువాత స్వామివారి ద‌ర్శ‌నం చాలా బాగుంది. ఆన్‌లైన్‌లో ఎక్కువ అద్దె ఉన్న ఎసి గ‌దులను కూడా బుకింగ్ కోసం ఉంచాలి. తిరుమ‌ల‌లో గ‌దుల నిర్వ‌హ‌ణ స‌రిగా లేదు.

ఈవో : ఆన్‌లైన్‌లో ఎసి గ‌దుల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డంపై యాత్రికుల నుంచి విజ్ఞ‌ప్తులందాయి. ఒక‌రోజు బుక్ చేసుకున్న వారు రెండు, మూడు రోజుల‌కు కూడా ఖాళీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య ఏర్ప‌డుతోంది. దీనిపై ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాం. గ‌దుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక‌పై ఆ స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు.

9. రామ‌లింగేశ్వ‌ర‌రావు – త‌ణుకు‌

ప్రశ్న: తిరుమ‌ల‌లో రోజూ జ‌రుగుతున్న వేద‌పారాయ‌ణం, నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు చాలా బాగున్నాయి.

ఈవో : చాలా సంతోషం. స్వామివారి కృప‌తో అధికార యంత్రాంగ‌మంతా బాగా ప‌నిచేస్తోంది.

10. కాంతారావు – గుంటూరు

ప్రశ్న: 60 ఏళ్లు దాటిని వారికి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ కావ‌డం లేదు.

ఈవో : 65 సంవ‌త్స‌రాలు దాటిన వారికి మాత్ర‌మే అనుమ‌తి లేదు. మీరు చెప్పిన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం.

11. మ‌నోహ‌ర్ – తిరుప‌తి

ప్రశ్న: లాక్‌డౌన్ త‌రువాత శ్రీ‌వారి ద‌ర్శ‌నం చాలా బాగుంది. తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో గ‌తంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ కౌంట‌ర్ ఉండేది. తిరిగి ప్రారంభిస్తే స్థానికుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ఈవో : అధికారుల‌తో చ‌ర్చించి అవ‌కాశాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్‌ఆర్‌.రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.