VEDA VIDWAT APPLICATIONS AVAILABLE IN TTD WEBSITE_ శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సుకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Tirumala, 9 Sep. 19: The officials of Dharmagiri Veda Vignana Peetham(DVVP) have set ready to conduct the 28th Veda Vidwat Sadas in February next.

According to Sri KSS Avadhani, the Principal of DVVP, exams to all vedic students whomsoever applied, will be conducted from February 25 to March 1 in 2020. These exams will be in 37 Sakhas (Departments) of Vedas. A-Grade certificates will be given away to the pass outs in these exams. These Certificates will be considered on priority for job opportunities in TTD or Endowments Departments in Vedic-related posts.

Interested students can apply for these exams. The last date of receiving applications is October 20. Already the applications are available on TTD official website, www.tirumala.org.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సుకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబ‌ర్ 09: తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ఆధ్వ‌ర్యంలో 2020 ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు( ప‌రీక్ష‌లు)లో పాల్గొనేందుకు అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఇందులో భాగంగా 37 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్లు ప్ర‌ధానం చేస్తారు. భ‌విష్య‌త్తులో టిటిడి, రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌లో అర్చ‌కుల‌ను నియ‌మించేట‌ప్పుడు ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌ధాన్యం ఇస్తార‌ని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలిపారు. గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు నిర్వ‌హించారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 20వ తేదీ సాయంత్రం వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. ఇత‌ర వివ‌రాల‌కు టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.