VEDA VIGNANA PEETHAM OBSERVES 125 CONVOCATION_ ఘనంగా తిరుమల వేదవిజ్ఞానపీఠం 125వ స్నాతకోత్సవం

Tirumala, 1 September 2017: The TTD-run Dharmagiri Veda Vignana Peetham observed its 125th Convocation in peetham premises on Friday.

Speaking on this occasion the Principal of the peetham Sri KS Avadhani said, established in 1884, this institution has given to the country many stalwarts in vedas and sanskrit. “Today we have 600 students in 17 vedic courses and 54 faculties. The students are shining in all the courses and 75 of them were selected today for the convocation. The students excelled in Rigvedam, Krishna Yajurvedam, Sukla Yajurvedam, Sama Vedam etc.

Another interesting thing this year is many of them were selected for TTD vedaparayanamdar scheme also. Some others got placements as Vedic pundits in Rajasthan, Mysore, Srungeri etc. Vedic centres”, he added.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఘనంగా తిరుమల వేదవిజ్ఞానపీఠం 125వ స్నాతకోత్సవం

సెప్టెంబర్‌ 01, తిరుమల 2017: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం 125వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ కె.ఎస్‌. అవధాని మాట్లాడుతూ తిరుమలలో 1884వ సంవత్సరంలో కళాశాల స్థాపించినట్లు తెలిపారు. 17 విభాగాలకు చెందిన 54మంది అధ్యాపకుల పర్యవేక్షణలో 600 మంది విద్యార్థులకు వేదాలు, ఆగమాలు, స్మార్థం, దివ్యప్రబంధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీరిలో 75మంది విద్యార్థులకు ఈ ఏడాది విద్యాసంవత్సర స్నాతకోత్సవంలో పట్టభద్రులు కానున్నట్లు తెలిపారు.

ఇక్కడ వేదవిద్యను అభ్యసించిన విద్యార్థులు కొందరు టి.టి.డి వేదపారాయణదార్‌ పథకం ద్వారా వేదపారాయణదారులుగా ఎంపికైనట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ఆలాయలలో అర్చకులుగాను, కళాశాలలో ఉపాధ్యాయులుగా, రాజస్థాన్‌, మైసూర్‌, కంచి, శ్రింగేరి వేదాధ్వయన సంస్థల్లో పండితులుగా ఉద్యోగావకాశాలు పొందినట్లు తెలిపారు.

అనంతరం పట్టభద్రులైన విద్యార్థులకు 5 గ్రాముల స్వామివారి వెండి డాలరు మరియు నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వేదపాఠశాల ఆధ్యాపకులు, విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.