VEDAS ARE ROOTS OF PROSPERITY- DATTA PEETHAM SEER _ వేదం సకల సంపదలకు మూలం : శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ

TTD CHAIRMAN ATTENDS CHATURVEDA HAVANAM AT MYSORE

 Tirupati, 04 September 2021:  Datta Peetham Pontiff Sri Sri Sri Ganapati Sachidananda Swamy said that Vedas comprised all mantras for the enhancement of wealth and for the well being of the mankind.

In his spiritual address at the Srinivasa Chaturveda Havanam on the fourth day on Saturday, the pontiff said that Vedas had embedded powers to fulfill all desires of human beings.

He said Srinivasa Chaturveda havanam grants both health and wealth to all Srivari devotees.

Speaking on the occasion TTD Chairman Sri YV Subba Reddy said TTD is committed to organize such spiritual programs as part of the propagation of Hindu Sanatana Dharma.

Dr Akella Vibhishana Sharma OSD of SV Institute of Higher Vedic studies highlighted the significance and benefits of the Srinivasa Chaturveda Havanam. Later in the evening, it was followed by bhajans and Vishnu sankeertans by the Sachidananda Swamy Ashram bhajan team.

Several Veda Bhashya pundits, Vedic pundits and devotees participated in the day-long program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేదం సకల సంపదలకు మూలం : శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ

పాల్గొన్న టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 తిరుపతి, 04 సెప్టెంబరు 2021: మానవుల మనుగడకు అవసరమైన ఇహపర సుఖాలను ప్రసాదించే మంత్రాలు వేదాల్లో ఉన్నాయని, ఇలాంటి వేదాలు సకల సంపదలకు మూలమని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ప్రబోధించారు.

మైసూరు దత్త పీరంలో తి.తి.దే నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో శ్రీ స్వామీజీ నాలుగో రోజు శనివారం ప్రసంగంలో వేద హవన శక్తిని తెలియజేశారు. శ్రీనివాస చతుర్వేద హవనంలో అన్ని వేదాలలోని మంత్రాలతో యజ్ఞవిష్ణును ఆరాధిస్తున్నారని, వేదం జీవులందరి కోరికలను ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉందని చెప్పారు. మానవుల సమస్త కోరికలు ఈనాడు డబ్బుతో ముడిపడ్డాయని భావిస్తున్నారని, మాములుగా ధనాన్ని సంపాదించిన వ్యక్తుల ఇళ్ళలో రెండు తరాలు లేదా మూడుతరాల నిలవడం చూస్తున్నామని, కానీ అమోఘమైన వేదాశీర్వచనాన్ని పొందిన కుటుంబాలలో లక్ష్మీదేవత తొమ్మిది తరాలకు పైగా స్థిరంగా నిలుస్తుందని వివరించారు. మానవులకు ఉత్తమలోకాలు కూడా కేవలం వేద ఆరాధన వల్లే సులభంగా సాధ్యమవుతుందని, కావున ఈ చతుర్వేద హననం సమస్త శ్రీవారి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని స్వామీజీ వివరించారు.

టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈ చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్వామీజీల సహకారంతో ఇలాంటి చతుర్వేద హవనాలు నిర్వహిస్తామన్నారు.

తదనంతరం గోపూజ, అశ్వపూజ, మంటపారాధనలతో చతుర్వేద హవనం నిర్వహించారు.

సాయంత్రం జ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాద్యయన సంస్థ అధికారి డా. ఆకెళ్ళ విభీషణ శర్మ వేద భారతిలో యజ్ఞ విషయాలను, మహిమలను విశ్లేషించారు. నాద యజ్ఞంలో భాగంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ భజన మండలి బృందంవారు విష్ణు కీర్తనలను, పండరీ భజనలను చక్కగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వేదభాష్య పండితులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.