VEDIC PRACTICES BEGET WORLD PROSPERITY, SAYS TTD JEO _ వేదప్రామాణికంగా నడిస్తేనే జగత్తు సుభిక్షం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirumala, 1 Oct. 19: TTD Joint Executive Officer Sri P Basant Kumar has said if everyone pursued a lifestyle as prescribed in Vedas there would be all-round prosperity in the world.
Participating in the Srinivasa Veda Vidwat Sadassu organised by the TTD Higher Vedic Studies as a part of annual Brahmotsavams at Asthana Mandapam in Tirumala on Tuesday, the JEO said the ancient knowledge cultured over thousands of years was like a rainbow and TTD has striven to popularize it.
He said TTD has set Veda pathasala and also SV Vedic University to promote Higher Vedic Studies and basic education. The SV Institute of higher Vedic studies also provided financial assistance to graduates of Vedic University to undertake societal good.
Later Acharya Virupakshi Jaddipal, Secretary of Maharshi Sandipani Rashtriya Veda Vidya Pratisthan of Ujjain presented his lecture on the significance of Veda Bhashyam In society.
Earlier Students Of Dharmagiri .veda pathasala presented Chaturveda Parayanam.
SV Vedic Varsity Vice-Chancellor Sri S Sudarshana Sharma, Estates Officer of TTD Sri Vijaya Saradhi, HVVS Project Officer Dr A Vibhishana Sharma were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI
వేదప్రామాణికంగా నడిస్తేనే జగత్తు సుభిక్షం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుమల, 2019 అక్టోబరు 01: వేదప్రామాణికంగా జగత్తు నడవాలని, అప్పుడే సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఆస్థానమండపంలో జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో మంగళవారం జెఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందన్నారు. ఇలాంటి వేద విజ్జానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టిటిడి శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ఎస్వీ వేద విశ్వవిద్యాలయంతోపాటు పలు ప్రాంతాల్లో వేద పాఠశాలలు స్థాపించి వేద విద్యను అందిస్తోందని వివరించారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా వేద పండితులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. వేద విద్యను అభ్యసించిన విద్యార్థులు అందులోని విషయాలను సమాజ హితానికి వినియోగించాలన్నారు. ప్రముఖ పండితులను ఆహ్వానించి ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా మరింత ప్రచారం చేయడానికి వీలవుతుందన్నారు.
అనంతరం ఉజ్జయినికి చెందిన మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ కార్యదర్శి ఆచార్య విరూపాక్ష వి.జడ్డిపాల్ సమాజంలో వేదభాష్యం ప్రాముఖ్యత అనే అంశంపై ఉపన్యసించారు. అంతకుముందు వేద విద్యార్థులు చతుర్వేద పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద వర్సిటీ విసి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారథి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.