VEDIC STUDENTS ARE HARBINGERS OF VEDIC CULTURE-GUV _ వేద విద్యార్థులు స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేయాలి: రాష్ట్ర గ‌వ‌ర్న‌రు గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్

TIRUPATI, 28 OCTOBER 2021: The Vedic students who passed out with degrees are harbingers of Vedic culture, advocated, HE the Honourable Governor of Andhra Pradesh Sri Biswa Bhusan Harichandan.

 

In the capacity of the Chancellor of SV Vedic University, addressing through a virtual platform on the occasion of the Sixth Convocation of the varsity, he said, India has taught the world Vedic sciences, Vedic arithmetic, Vedic commerce, Vedic economics some thousands of years ago itself.  “By virtue of this great cultural heritage, India has preached to the world the concept of equality and international brotherhood”, he maintained.

 

Complimenting the efforts of the Vice-Chancellor and his team of SVVU for strengthening the Vedic texts, the Governor called upon the pass outs to strive hard to keep alive the Vedic knowledge to reach out to the common man.

 

Sri Ganeshan Srouthi who was conferred with Mahamahopadhyaya (Honoris Causa), in his address as Chief Guest said, if everyone follows the righteous way of life as taught by Vedas, then there will be absolved of all issues.

 

Earlier, the Vice-Chancellor Sri Sannidhanam Sudarshana Sharma read out the annual report. Later the Vedic students were also awarded with degree certificates.

 

TTD EO Dr KS Jawahar Reddy, Registrar Dr K Tarakarama Kumara Sarma, Deans Sri Subramanya Sarma, Sri Srinivasacharyulu, faculty, students were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయండి

– వేద విద్యార్థులు స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేయాలి :

రాష్ట్ర గ‌వ‌ర్న‌రు గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్

ఘ‌నంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం

బ్ర‌హ్మ‌శ్రీ గణేశన్ శ్రౌతికి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం ప్ర‌దానం

తిరుపతి, 2021 అక్టోబ‌రు 28: సాక్షాత్తు భగవంతుని స్వరూపమైన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని, అలాంటి వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయాలని రాష్ట్ర గ‌వ‌ర్న‌రు గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం గురువారం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర గ‌వ‌ర్న‌రు ( వర్చువల్ ) పాల్గొని ప్ర‌సంగిస్తూ భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల నుండి స‌నాత‌న ధ‌ర్మం, వేద విజ్ఞానం ప‌రిఢ‌విల్లుతోంద‌న్నారు. మ‌న పూర్వీకుల నుండి వార‌స‌త్వంగా అందిన వేదాల‌ను ఉత్తీర్ణులైన విద్యార్థులు వ్యాప్తి చేయాలన్నారు. వీరు స‌మాజానికి ద‌శ – దిశ నిర్ధేశం చేయాల‌న్నారు. జ‌గ‌త్తున‌కు వేదాలే తొలి విద్యా విధానాల‌ని, అక్క‌డి నుండి వ‌చ్చిన‌దే నేటి శాస్త్ర విజ్ఞానమ‌ని చెప్పారు. వేలసంవ‌త్స‌రాల క్రిత‌మే గ‌ణిత, వైజ్ఞానిక‌, ఆర్థిక‌, సాంకేతిక‌, జ్యోతిష్య శాస్త్రాలను మ‌న పూర్వీకులు వేదాల్లోని వైదిక అంశాల‌ను మేళవించి ప్రపంచానికి అందించారని తెలిపారు. ఇందులో భాస్క‌రుని గ‌ణిత శాస్త్రం, ధ‌న్వంత‌రి వైద్య శాస్త్రం, విరాట సంహీత‌, భ‌ర‌ద్వాజ విమాన శాస్త్రం, కౌటిల్యుని ఆర్ధ శాస్త్రాలు వీటికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని చెప్పారు. అంత‌టి గొప్ప సాంస్కృతి సంప్ర‌దాల‌ను వేద విద్య అందించింద‌ని తెలియ‌జేశారు.

నేడు ప్ర‌పంచానికి భార‌త‌దేశం దిక్సూచిగా నిలుస్తోందంటే మ‌న స‌నాత‌న‌ వేద విద్యే కారణమన్నారు. ఎస్వీ వేద విశ్వ విద్యాల‌యం నేటి వైజ్ఞానిక అంశాల‌తో వేద గ‌ణితం, భార‌తీయ సంస్కృతి, సంస్కృత పాఠాలు జోడించి ఆన్‌లైన్ కోర్సులుగా ప్ర‌వేశ పెట్టిన‌ట్లు చెప్పారు. భ‌విష్య‌త్ త‌రాల‌కు వేద విద్య‌ను అందించేందుకు వారు చేస్తున్న కృషిని గౌ. గ‌వ‌ర్న‌రు అభినందించారు.

ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ మాట్లాడుతూ వేద విద్య వ్యాప్తికి చేస్తున్న కృషిని, వ‌ర్సిటీ ప్ర‌గ‌తిని తెలియ‌జేశారు. వేద విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల‌కు రూ.ఒక లక్ష నుండి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. వేదాల‌కు ప్రాచుర్యం క‌ల్పించేందుకు పుస్త‌కాలు ముద్రిస్తున్నామ‌ని, రాత‌ప్ర‌తులను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, వేదాలు, ఉప‌నిషత్తుల‌ను రికార్డింగ్ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం పొందిన‌ బ్ర‌హ్మ‌శ్రీ గణేశన్ శ్రౌతి మాట్లాడుతూ ” స‌ర్వాం వేదాత్ ప్ర‌సిధ్యాత్ ” అన్న‌విధంగా ఈ ప్ర‌పంచం మొత్తం వేదంతో ముడిప‌డి ఉంటుంద‌ని ఆర్ష ధ‌ర్మం తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌ని, వేద విద్య అజ్ఞానాన్ని దూరం చేసి ఆత్మ‌జ్ఞానాన్ని అందిస్తుంద‌న్నారు. భ‌గ‌వంతుని నిశ్వాస రూపంగా బ‌య‌టికి వెలువ‌డిన వేదాలు స‌మ‌స్త కాలాల్లో ఆయా ఫ‌లాల‌ను లోకానికి అందించ‌గ‌ల‌వ‌ని పేర్కొన్నారు. వేద విద్య నేర్చుకున్న విద్యార్థులు తిరిగి కొంద‌రికి నేర్పి వేద వ్యాప్తికి కృషి చేయాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, రిజిస్ట్రార్డా .కె.తార‌క‌రామ‌కుమార్ శ‌ర్మ‌, ఇసి మెంబ‌ర్ ఆచార్య శ్రీ రామ్‌లాల్‌, డీన్‌లు ఆచార్య గోలి సుబ్ర‌మ‌ణ్య శ‌ర్మ‌, ఆచార్య శ్రీ‌నివాసాచార్యులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా.రామ‌క్రిష్ణ ఆంజ‌నేయులు, కోఅర్డినేట‌ర్ డా.ఉమేష్ భ‌ట్‌, అధ్యాప‌కులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.