VENGAMAMBA IS A SYMBOL OF WOMEN EMPOWERMENT 

TIRUMALA, 22 MAY 2024: Matrusri Tarigonda Vengamamba is a symbol of women empowerment and fought against social evils in her times and became one of the ardent devotees, advocated HH Sri Swarupananda Saraswathi Maha Swamy of Visakha Sarada Peetham.

The pontiff graced the Vengamamba Jayanti fete held at Narayanagiri Gardens in Tirumala on Wednesday evening.

In his Anugraha Bhashanam he cited the great works of Vengamamba including her writings, Annaprasadam distribution etc.

Earlier he released two books and a CD of Vengamamba on the occasion.

After Sahasra Deepalankara Seva, the Utsava deities reached Padmavati Pariyanotsava Mandapam. In front of the deities, the artistes of Annamacharya and Vengamamba projects along with renowned singer Smt Srinidhi rendered Sankeertans penned by Vengamamba including

Gana Nayaka… 

Balagopalam Bhaje.. 

Vacchenu krishnudu

Sri Madanagopala.. 

Mangqlam Mangalam Nrisimhate Mangalam 

and many more in a melodious manner.

TTD EO Sri AV Dharma Reddy, JEO(H&E) Smt Goutami, SVETA Director Sri Bhumana Subramanyam Reddy, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి ప్రతీక : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ

– ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమల, 2024 మే 22: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి, సాధికారతకు ప్రతీక అని, ఆమె కాలంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన భక్తులలో ఒకరిగా నిలిచారని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిస్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు బుద‌వారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ తపస్సు చేయవచ్చా, అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేయవచ్చా అనే మూఢనమ్మకాల వలన చాలా కష్టాలు అనుభవించి పరమాత్ముని దర్శిస్తూ స్త్రీ మూర్తి జ్ఞానమూర్తిగా మారిందన్నారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. వెంగమాంబ రచనలను సాక్షాత్తు శ్రీవారు అంగీకరించినట్టు చెప్పారు. భారత, భాగవత, రామాయణాల తరహాలో వెంగమాంబ రచించిన వేంకటాచల మహత్యం అంతటి పవిత్రమైందని తెలిపారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు స్వామీజీ అభినందించారు.

అంతకుముందు స్వామీజీ వెంగమాంబ సంకీర్తనల రెండు పుస్తకాలు, సీడీని విడుదల చేశారు.

ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ప్రముఖ గాయని శ్రీమతి శ్రీనిధితో పాటు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఇందులో ” గణనాయక శరణు…., బాలగోపాలం భజే హే మనసా…., వచ్చెను కృష్ణడు వగమీరగ…., లాలి మద్దుల బాల లాలి గోపాల…., జయమంగళం నిత్య శుభ మంగళం…., వేదములే నీ నివాసమట విమల నారసింహ….,” తదితర సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి, శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టుల సంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల‌.విభీషణ శర్మ, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.