VENGAMAMBA PIONEERED WOMEN EMPOWERMENT _ వెంగమాంబ రచనలు మహిళా సాధికారతకు మార్గదర్శకం

TAKE FORWARD HINDU SANTANA DHRAM THROUGH SOCIAL MEDIA IN A BIG WAY
 
-VISAKHA SARADA PEETHADHIPATHI
 
TIRUPATI, 23 MAY 2024: Matrusri Tarigonda Vengamamba, the saint poetess of the 18th Century brought about women empowerment in her times fighting against social evil and pioneered Annaprasadam in Tirumala, said the Pontiff of Visakha Sarada Peetham, HH Sri Swarupanandendra Saraswathi Swamy.
 
The Pontiff while addressing the senior officers of TTD in SVETA during the 294th Vengamamba Jayanti fete organised by the Vengamamba Project of TTD on Thursday evening he advocated that the essence of Hindu Santana Dharma should be propagated on various social media platforms in a big way like Twitter, Facebook, Instagram etc. so that it will reach a wide range of the public.
 
“The ancient temples of India are centres of knowledge, ethics, social service and also income generating centres. Every individual should take up the responsibility of propagating Hindu Dharma in a wide spread manner in this fast-growing world and sustain our Vedic Dharma for future generations”.
 
He said, TTD besides making the best use of its Sri Venkateswara Bhakti Channel and publishing dharmic books, should also take up Hindu Dharma Prachara through social media platforms also as today majority of people irrespective of ages have Twitter, WhatsApp, Facebook accounts etc.
 
TTD JEO for Health and Education Smt Goutami, SVETA Director Sri Subrahmanyam Reddy and other officers were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

వెంగమాంబ రచనలు మహిళా సాధికారతకు మార్గదర్శకం

– సోషల్ మీడియా ద్వారా హైందవ సనాతన ధర్మాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్లండి

•⁠ ⁠విశాఖ శారదా పీఠాధిపతి

తిరుపతి, 2024 మే 23: మాతృశ్రీ తారిగొండ వెంగమంబ ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, మహిళ సాధికారతను తీసుకువచ్చి, తిరుమలలో అన్నప్రసాద వితరణకు మార్గదర్శకత్వం వహించినట్లు విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిస్వజీ ఉద్ఘాటచారు.

గురువారం సాయంత్రం టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్వేతాలో టీటీడీ సీనియర్ అధికారులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

“భారతదేశంలోని పురాతన దేవాలయాలు విజ్ఞానం, నీతి, సామాజిక సేవ మరియు ఆదాయ కేంద్రాలని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను ప్రతి వ్యక్తి స్వీకరించాలని, భావి తరాలకు మన వేద ధర్మాన్ని అందించాలని పిలుపునిచ్చారు”.

టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ మరియు ధార్మిక పుస్తకాలను ప్రచురించడం ద్వారా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా హిందూ ధర్మ ప్రచారాన్ని విస్కృతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ప్రతి ఒక్కరికి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయి. కనుక మన సనాతన ధార్మిక అంశాలను సాంఘిక మాధ్యమాల ద్వారా మరింత విస్తారంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, శ్వేత మరియు వెంగమాంబ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ శ్రీ భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.