VENGAMAMBA STATUE AT TIRUPATI GARLANDED _ తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

Tirupati, 16 Aug. 21: TTD officials on Monday garlanded and paid floral tributes to Matrusri Tarigonda Vengamamba statue at Balaji colony circle as part of 204 vardanti of saint poetess.

 

The three day long Utsav celebrations including literary conferences, cultural programs and Bhakti sankeertans also concluded this evening.

 

The highlight of the festivities were a group concert by Sri Udayabhaskar Reddy and Smt Koneru Lakshmirajyam team followed by Harikatha parayanam by Smt P Jayanti Savitri troupe.

 

TTD Dyeo Sri Vijayasaradhi, Tarigonda Vengamamba project Coordinator Dr C Lata, Superintendent Smt Nagamani and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2021 ఆగస్టు 16: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు సోమ‌వారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జ‌రిగిన వ‌ర్ధంతి ఉత్స‌వాలు ముగిశాయి.

ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ముందుగా శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, శ్రీమతి కోనేరు ల‌క్ష్మీరాజ్యం బృందం సంగీత స‌భ, ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు తిరుపతికి చెందిన శ్రీమతి పి.జ‌యంతి సావిత్రి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈఓ శ్రీ విజయసారథి, తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత, సూపరింటెండెంట్ శ్రీమతి జి.నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్రీ బి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.