VENGAMAMBA STONE MANDAPAM FETE ON JUNE 3 _ జూన్ 3న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి మండ‌ప‌మున‌కు శ్రీ‌వారు

Tirumala, 01 June 2021: As per tradition Sri Malayappa Swamy and His consorts will pay a ceremonial visit to rock Mandapam of one of His ardent devotees Matrusri Tarigonda Vengamamba on June 3.

It is a well-known practice that every year 10 days after Sri Narasimha Jayanti, Sri Malayappa accompanied by His consorts goes on a procession to the rock mandapam located on North Mada Street and receives her hospitality followed by Asthanam after Sahasra Deepalankara Seva.

HISTORICAL SIGNIFICANCE:

It is Historically known that the stone house of Saint Poet Sri Tallapaka Annamacharya was also happened to be the home to Sri Matrusri Tarigonda Vengamamba whenever she visited Tirumala.

In those days Annamacharya built a Mantapam in front of his home for performing utsavas and reception for the entourage of Sri Malayappa. Pundits say that Vengamamba also continued the practice of organising grand reception to Sri Malayappa in the mantapam.

The tradition is continued by TTD even to date on the Tenth day from Narasimha Jayanti.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 3న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి మండ‌ప‌మున‌కు శ్రీ‌వారు

తిరుమ‌ల‌, 2021 జూన్ 01: భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కాణంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి గృహ‌మున‌కు ముందు ఉన్న రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు జూన్ 3వ తేదీన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు విచ్చేయ‌నున్నారు.

ప్ర‌తి ఏడాది న‌ర‌సింహ జ‌యంతి త‌రువాత‌ 10వ రోజున‌ స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు శ్రీ‌వారు ఉభ‌య దేవేరుల‌తో క‌లిసి ఊరేగింపుగా వేంచేపు చేసి ప్ర‌త్యేక ఆస్థానం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది.

చారిత్రాక ప్రాశ‌స్త్యం :

తిరుమ‌ల‌లో తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల వారి రాతి గృహ‌ములో త‌రిగొండ వెంగ‌మాంబ కొన్ని సంవ‌త్స‌రాల పాటు నివ‌సించిరి. ఆ స‌మ‌యంలో తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల కుమారులు త‌మ గృహ‌మున‌కు ముందు రాతి మండ‌ప‌ము నిర్మించి అందులో స్వామివారిని వేంచేపు చేసి ఉత్స‌వాలు నిర్వ‌హించేవారు. ఈ ఆన‌వాయితీని అనుస‌రించి వెంగ‌మాంబ‌ కూడా త‌న ఇంటికి స్వామివారిని వేంచేపు చేసి ఉత్స‌వం చేయ‌డం ప్రారంభించిన‌ట్లు పండితులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.