VENKATESWARA SARANAGATI IS PATH TO SALVATION _ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి శరణాగతి మోక్షానికి మార్గం -శ్రీ కె.సేతురామ‌న్‌

TIRUPATI, 11 MAY 2024: Total surrender to Sri Venkateswara Swamy is the only way for attaining salvation said, renowned scholar Sri Seturaman.

On the second day evening of Sri Ramanuja Avatara Mahotsavams held in Annamacharya Kalamandiram at Tirupati on Saturday evening, he delivered lecture on ”Annamacharya Saranagati Gadyam” and informed various interesting topics in that book.

Later Harikatha Parayanam by the Annamacharya Project artist Sri. Chandrasekhara Bhagavatar impressed the audience.

Project co-ordinator Sri Purushottam was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి శరణాగతి మోక్షానికి మార్గం -శ్రీ కె.సేతురామ‌న్‌

తిరుప‌తి, 2024 మే 11: కర్మ, జ్ఞాన, భక్తి యోగాల కంటే శ్రీ వేంకటేశ్వరస్వామివారి శరణగతి మోక్ష మార్గానికి సులభమయన పద్ధతి అని అహోబిలంకు చెందిన ప్రముఖ పండితులు శ్రీ కె.సేతురామ‌న్‌ తెలిపారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రామానుజాచార్యుల అవ‌తార మ‌హోత్స‌వాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీ కె.సేతురామ‌న్‌ ‘ శ్రీ రామానుజాచార్యులు – శరణాగతి గద్యం’ అనే అంశంపై ఉపన్యసిస్తూ శ్రీరామానుజులు విశిష్ట అద్వైత్య సిద్ధాంతాన్ని తొమ్మిది గ్రంథాలుగా రాసారని, అందులో శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యాలైన మూడు గ్రంథాలు వాక్య రూపంలో వున్నట్లు చెప్పారు. ఇందులో శ్రీరంగనాథుని సన్నిధిలో భక్తులందరి తరపున శ్రీ రామానుజార్యులు భగవంతుని శరణు కోరడం శరణాగతి గద్యం, శ్రీ రంగనాథుడు, శ్రీరామానుజాచార్యులకు మధ్య సంభాషనాను శ్రీరంగ గద్యం, నేరుగా భగవంతుని ఆశ్రయించడం తెలియనివారు శ్రీరామానుజార్యులను ఆశ్రయస్తే చాలు మోక్షం సిద్ధిస్తుందని తెలిపే వైకుంఠ గద్యం గురించి పురాణ ఇతిహాసాలతో వివరించారు.

శరణాగతిని పొందినవాళ్లను ప్రపన్నులంటారని, అట్టి ప్రపన్నులందరికీి మూల పురుషుడు శ్రీనమ్మాళ్వార్‌ అని చెప్పారు. సామాన్య ప్రజలు సైతం శరణాగత భక్తితో భగవంతుని ప్రార్థిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని రామానుజులు విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు.

అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ చంద్రశేఖర భాగవతార్ బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, పురప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.