ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు సీల్డ్ టెండర్లు ఆహ్వానం
ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు సీల్డ్ టెండర్లు ఆహ్వానం
తిరుపతి, 2019 జూన్ 5: టిటిడికి అనుబంధంగా ఉన్న విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల సరఫరాకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది.
ఆలయ కార్యాలయంలో జూన్ 6 నుండి 25వ తేదీ 5.00 గంటల లోపు రూ.200 – చెల్లించి టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు పొందవచ్చు. అదేవిధంగా జూన్ 26వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్ టెండర్లు తెరుస్తారు. ఆశక్తి గలవారు ఈఎమ్‌డి రూ.10,000- ‘టిటిడి ఈవో, తిరుపతి’ పేరిట డిడి చెల్లించి పాల్గొనవచ్చును.
మరిన్ని వివరాలకు ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ కార్యాలయం ఫోన్ నెం. 9441517842, 6301486374 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.