VENUGOPALA KRISHNA ATOP SARVABHUPALA _ సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 21 September 2023: On the evening of the Thursday as part of the annual  Brahmotsvams,  Sri Malayappa Swamy along with His consorts Sridevi and Bhudevi rode on Sarvabhupala Vahanam to bless tens of thousands of devotees who had converged in the galleries of the four mada streets.

Significance

Sarvabhoopala means that Sri Venkateswara is the Supremo of the entire cosmos.

The TTD Chairman Sri Bhumana Karunakara Reddy, TTD EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వ‌భూపాల‌ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీ డికె.బాలాజి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.