VICE PRESIDENT OFFERS PRAYERS ALONG WITH CM OF AP _ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
Tirumala, 25 September 2025: The Honourable Vice President of India Sri CP Radhakrishnan accompanied by the Honourable CM of AP Sri N Chandrababu Naidu offered prayers in the temple of Sri Venkateswara Swamy on Thursday.
Upon his arrival at the Mahadwaram of the temple, the Vice-President was accorded the traditional Isthikaphal welcome by the temple priests, amidst chanting of Vedic mantras. Later the Vice President along with his family, CM of AP offered prayers in the temple of Sri Venkateswara Swamy.
After darshan, the protocol dignitary was offered Vedaseervachanam in Ranganayakula Mandapam by the Vedic scholars. TTD Chairman Sri BR Naidu and the EO Sri AK Singhal offered Theertha Prasadams, 2026 TTD Calendar and Diary, laminated photo of Srivaru to the Vice President of India.
TTD Board members, other dignitaries, officials were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
తిరుమల, 2025 సెప్టెంబర్ 25: భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
వేదాశీర్వచనం అనంతరం వారికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. అటు తరువాత 2026 సంవత్సరానికి సంబంధించిన టిటిడి క్యాలెండర్లు, డైరీలను ఉపరాష్ట్రపతికి అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



















