VICE PRESIDENT OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి
LAUDS TTD DHARMIC ACTIVITIES
TIRUMALA, 10 FEBRUARY 2022: The Honourable Vice President of India, Sri M Venkaiah Naidu offered prayers to Sri Venkateswara Swamy in Tirumala temple on Thursday along with his family and entourage.
The Vice Prez reached the temple through Vaikuntam Queue Complex and was welcomed by TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy near Mahadwaram.
After Darshan, he was rendered Vedaseervachanam by Pundits in Ranganayakula Mandapam. Later TTD Chairman and EO presented Thirtha Prasadams, Calendar, Diary and Coffee Table book to the dignitary.
While presenting the laminated photo of deity made of Dry Flower Technology, Agarbattis Panchagavya products and the six sheet calendar, the EO briefed the vice President about their preparation and significance.
Later speaking on the occasion, he said he prayed to Sri Venkateswara Swamy to bestow his benign blessings on the humanity across the world. He also lauded TTD for taking up new initiatives and taking forward Hindu Dharma Prachara in a big through various spiritual programmes. He said he also sought Srivaru to bless his granddaughter with a blissful marital life who is entering the nuptial knot at His divine abode on Thursday.
LAC President of Chennai Sri Sekhar Reddy, LAC President of New Delhi Smt V Prasanthi, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Ramesh Babu, Reception DyEO Sri Lokanatham and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి
– టిటిడి చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశంసించిన ఉప రాష్ట్రపతి
తిరుమల, 2022 ఫిబ్రవరి 10: భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. గౌ|| ఉపరాష్ట్రపతికి టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తరువాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. గౌ|| ఉపరాష్ట్రపతికి చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని అందజేశారు.
ఇటీవల డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ల్యామినేటెడ్ ఫోటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు మరియు ఆరు షీట్ల క్యాలెండర్ ఈవో అందజేస్తూ, వాటి తయారీ, ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా గౌ. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించిన్నట్లు తెలిపారు. టిటిడి అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు వెళుతున్నందుకు ఆయన ప్రశంసించారు. గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తన మనుమరాలు సుష్మకు ఆనందకరమైన వైవాహిక జీవితాన్నిఅనుగ్రహించాలని శ్రీవారిని కోరినట్లు ఆయన తెలిపారు.
చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.