VICE PREZ OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌డ్‌

Tirumala, 26 April 2024: The Honourable Vice President of India Sri Jagdeep Dhankar along with his spouse Smt Sudhesh Dhankar on his maiden visit to Tirumala temple offered prayers to Sri Venkateswara Swamy on Friday.

Expressing his divine experience he said, this visit is closest to spirituality, divinity and religiousity. He felt blessed and sought bliss for humanity. 

Adding further he said he experienced the sync of heart, mind and soul.

“I am leaving this place fully surcharged, inspired and motivated to be in the service of Bharat, the oldest civilization on the planet and home to one-sixth of humanity”.

“This place exemplifies virtuosity, sublime administration, seamless functioning and this can be a role model for religious dispensations. I take for me and for my wife, a lifetime moment ever to be cherished”, he expressed.

Earlier he was received at the temple mahadwaram by Archakas with ceremonial welcome along with TTD Chairman Sri Bhumana Karunakar Reddy and EO Sri AV Dharma Reddy.

After Srivari Darshan, the Vice President was presented with Srivari Theertha Prasadams, a portrait, calendar and diaries by the TTD Chairman.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌డ్‌

తిరుమల, 2024 ఏప్రిల్ 26: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్ర‌వారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌డ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

గౌ|| ఉప రాష్ట్రపతి శుక్ర‌వారం ఉదయం తిరుమలలోని ర‌చ‌న‌ విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌డ్‌
మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికతలో మహోన్నతమైనదని చెప్పారు. టీటీడీ పరిపాలన, భక్తులకు అందిస్తున్న సేవలు అన్ని మతాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ భూమ్మీద నివసించే మానవాళిలో 1/6 వంతు భారతీయులని, పురాతన నాగరికతకు భారత భూమి జన్మస్థానమని వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ఉప రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఈవో శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌డ్‌కు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.