VICE PREZ OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
Tirumala, 5 Mar. 21: The Vice President of India Sri M Venkaiah Naidu along with his family offered prayers in Srivari temple on Friday.
Earlier, he reached the temple through Vaikuntham Queue Complex accompanied by Deputy CM Sri Narayana Swamy.
On his arrival at the entrance of main temple he was welcomed by TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, and CVSO Sri Gopinath Jatti.
After offering prayers in the temple he was rendered Vedasirvachanam by Vedic Pundits. Later he was presented with Theertha Prasadams and Portrait of Sri Venkateswara Swamy by the Executive Officer.
District Collector Sri Harinarayanan, Tirupati Urban SP Sri Venkatappala Naidu were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
తిరుమల, 2021 మార్చి 05: భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అంతకుముందు ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామితో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. గౌ|| ఉపరాష్ట్రపతికి టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు. తరువాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. గౌ|| ఉపరాష్ట్రపతికి ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.