”VIDURA NEETI” BY CHAGANTI COMMENCES_ వ్యక్తి హితం కంటే సమాజ హితం ముఖ్యం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Tirupati, 14 January 2018: Renowed spiritual scholar Bramhasri Chaganti Koteswar Rao explained about the importance of dharma quoting ” Vidura Neeti”.
The two-day religious discourse by chaganti commenced on sunday evening in Mahati auditorium. On Tuesday evening also the discorse will be held between 6pm and 8pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
వ్యక్తి హితం కంటే సమాజ హితం ముఖ్యం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి, 14జనవరి 2018 ; వ్యక్తి సంతోషం కంటే సమాజం మొత్తం సంతోషంగా ఉండడం ముఖ్యమని, ఇలాంటి కార్యాలను మాత్రమే అందరూ ఆచరించాలని విదురుడు బోధించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ‘విదురనీతి’పై రెండు రోజుల ధార్మికోపన్యాసాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ ద్వాపరయుగంలో దృతరాష్టుడు అనే రాజు వద్ద విదురుడు మంత్రిగా ఉండేవారని తెలిపారు. రాజ్యకాంక్షతో పాండవులను పలు ఇబ్బందులు పెడుతున్న దృతరాష్టునికి విదురుడు ఏ మాత్రం సంశయం లేకుండా ధర్మబద్ధంగా పలు సూచనలు చేశాడని చెప్పారు. విదురుని మాటలకు దేశకాల పరిమితి లేదని, ఏ ప్రాంతంలోనైనా, ఏ కాలంలోనైనా చెల్లుబాటవుతాయని వివరించారు. సమాజపరంగా, శీలపరంగా, వ్యక్తిపరంగా, వ్యక్తిత్వపరంగా మానవులు ఎలా నడుచుకోవాలనే విషయాలను విదురుడు తెలియజేశాడని చెప్పారు.
మహతి కళాక్షేత్రంలో సోమవారం కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ధార్మికోపన్యాసాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.