టిటిడి విద్యాదాన ట్రస్టుపై జెఈవో సమీక్ష
టిటిడి విద్యాదాన ట్రస్టుపై జెఈవో సమీక్ష
తిరుపతి, 2019 మార్చి 16: టిటిడి విద్యాదాన ట్రస్టు కార్యకలాపాలపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం శనివారం తమ బంగళాలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించాలన్నారు. టిటిడి పరిధిలోని అన్ ఎయిడెడ్ పాఠశాలలైన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి పాఠశాల, తాటితోపులోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పాఠశాల, తిరుపతి, భీమవరం, వరంగల్ ప్రాంతాల్లో గల ఎస్వీ బదిర పాఠశాలల విద్యార్థులకు గతేడాది తరహాలోనే పుస్తక ప్రసాదం అందించాలని సూచించారు. తిరుపతి, భీమవరం, వరంగల్ ప్రాంతాల్లో గల ఎస్వీ బదిర పాఠశాలల విద్యార్థులకు, సికింద్రాబాద్‌లోని ఎస్వీవివిఎస్(సంస్కృతం) పాఠశాల కలిపి మొత్తం 920 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరానికి వస్త్ర ప్రసాదం అందించాలని ఆదేశించారు. డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య శిక్షణలో భాగంగా యోగా, మెడిటేషన్, కంప్యూటర్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పిస్తున్నామని తెలిపారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ సమకూర్చాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి స్పెషల్ ఎడ్యుకేషన్ డెప్యూటీ ఈవో శ్రీమతి భారతి, ఏఈవో శ్రీ గురవయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.