VIGILANCE AWARENESS WEEK BY TTD _ టిటిడి ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం
Tirumala, 30 Oct. 19: Following the call given by the Central Vigilance Commission(CVC), the Vigilance wing of TTD will observe the Vigilance Awareness Week from October 29 till November 3.
Every year during the week is being observed across the country commemorating the birth date of Sardar Vallabhbhai Patel – the Iron Man of India on 31st October.
The important activities during the week long programme includes
- Eradicate Corruption to Build a New India
- Taking Integrity Pledge by all employees
- Organising workshops and sensitization programmes for employees
TTD has also taken up awareness programme with each section of employees on each day.
On October 31, anti-corruption pledge will be taken by all employees at Tirumala.
Under the instructions of CVSO Sri Gopinath Jatti, Vigilance SO Sri Prabhakar is looking after events of Vigilance Week.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం
తిరుమల, 2019 అక్టోబరు 30: కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు టిటిడి ఆధ్వర్యంలోని విజిలెన్స్ విభాగం అక్టోబరు 29 నుండి నవంబరు 3వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహిస్తోంది. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా అవినీతిని నిర్మూలించి నూతన భారతావనిని నిర్మించడం, ఉద్యోగులతో సమైక్యతా ప్రతిజ్ఞ చేయించడం, భద్రతపై అవగాహన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. టిటిడిలోని అన్ని విభాగాల్లోనూ ఉద్యోగులకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబరు 31న తిరుమలలో ఉద్యోగులతో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయిస్తారు.
టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు విఎస్వో శ్రీ ప్రభాకర్ ఈ విజిలెన్స్ వారోత్సవం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.