VIGILANCE DEPARTMENT PROVIDES FINANCIAL AID TO DECEASED PILGRIM FAMILY _ రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి రూ.1లక్ష ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి రూ.1లక్ష ఆర్థిక సహాయం
గత ఏడాది తిరుమలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి తి.తి.దే నిఘా మరియు భద్రతా విభాగం శుక్రవారంనాడు వారి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించింది.
వివరాల్లోకి వెళితే గత ఏడాది జూన్ నెల 14వ తేది తిరుమలలోని జి.ఎన్.సి టోల్గేట్ చెంత లగేజివ్యాను బంపరు ఢీకొని ముంబయికి చెందిన శ్రీమతి కె.విజయలక్ష్మి కుమార్తె కె. మహేశ్వరి అనే ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి శుక్రవారంనాడు తిరుమలలోని విజిలెన్సు కార్యాలయంలో అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్ రెడ్డి రూపాయలు 1 లక్ష చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు.
ఏ.వి.ఎస్.ఓ శ్రీ సాయిగిరిధర్, తిరుమల రవాణాశాఖ డి.ఐ శ్రీ పి.భాస్కర్‌నాయుడు తదితరులు కూడా ఉన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.