VIGILANCE DEPARTMENT PROVIDES FINANCIAL AID TO DECEASED PILGRIM FAMILY _ రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి రూ.1లక్ష ఆర్థిక సహాయం 

TIRUMALA, MARCH 29:  In a kind gesture, the TTD Vigilance and Security Department has offered a cheque of Rs.1lakhs as financial aid to the deceased pilgrim family in Tirumala on Friday.
 
A seven-year old K.Maheshwari, daughter of Smt K Vijayalakshmi hailing from Bandra East of Mumbai died in Tirumala near GNC toll gate on 14th June during last year when she was hit by a luggage van. 
 
TTD Additional CVSO Sri GVG Ashok Kumar handed over a cheque of Rs.1lakh to Smt Vijayalakhsmi in Vigilance office in Tirumala on Friday. 
———————————
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి రూ.1లక్ష ఆర్థిక సహాయం

గత ఏడాది తిరుమలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారికి తి.తి.దే నిఘా మరియు భద్రతా విభాగం శుక్రవారంనాడు వారి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించింది.

వివరాల్లోకి వెళితే గత ఏడాది జూన్‌ నెల 14వ తేది తిరుమలలోని జి.ఎన్‌.సి టోల్‌గేట్‌ చెంత లగేజివ్యాను బంపరు ఢీకొని ముంబయికి చెందిన శ్రీమతి కె.విజయలక్ష్మి కుమార్తె  కె. మహేశ్వరి అనే ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి శుక్రవారంనాడు తిరుమలలోని విజిలెన్సు కార్యాలయంలో  అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌ రెడ్డి రూపాయలు 1 లక్ష చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు.

ఏ.వి.ఎస్‌.ఓ శ్రీ సాయిగిరిధర్‌, తిరుమల రవాణాశాఖ డి.ఐ శ్రీ పి.భాస్కర్‌నాయుడు తదితరులు కూడా ఉన్నారు.  
  
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.