VIGILANCE ENQUIRY ON THOSE EMPLOYEES FOR DAMAGING TTD REPUTATION- JEO SRI BASANT KUMAR _ సంస్థ ప్ర‌తిష్ట దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ : తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్

Tirumala, 5 Jun. 20: Joint Executive Officer, Sri P Basant Kumar said on Friday that TTD would initiate vigilance enquiry on those employees who resorted to activities damaging the devotees sentiments and reputation of the TTD institution.

He was participating in a media conference at Annamaiah Bhavan at Tirumala along with Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy.

He said there was a malafide campaign recently with regard to a public auction of some TTD immovable properties and an article in the Sapthagiri magazine.

To put an end to such motivated campaigns, the TTD Board had decided to publish a white paper on the affairs of all TTD properties on March 28. Even before the report is being readied, the details were telecasted by an electronic media channel on May 30 and 31.

Similarly, the vigilance department is also directed to conduct an enquiry against the publication of an article in the Sapthagiri magazine in April this year. Though the same article was rejected in 2016-17, it was published in 2020 April edition raking up a new controversy. Even before the book is released in the market, it was somehow procured by some which has given scope to raise controversy.

On these two episodes vigilance enquiry is on and severe action will be taken against them if proved guilty,  he maintained.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంస్థ ప్ర‌తిష్ట దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ : తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుమల, 2020 జూన్ 05: భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న టిటిడి సంస్థ ప్ర‌తిష్ట‌ దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి జెఈవో మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇటీవ‌ల టిటిడి ఆస్తుల‌కు సంబంధించిన అంశంపై, అదేవిధంగా, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఒక క‌థ‌నంపై తీవ్రంగా దుష్ప్ర‌చారం జ‌రిగింద‌న్నారు. టిటిడి ఆస్తుల‌పై శ్వేత‌ప‌త్రం రూపొందించాల‌ని మే 28న జ‌రిగిన బోర్డు స‌మావేశంలో తీర్మానం చేశార‌ని చెప్పారు. దీనికి సంబంధించి శ్వేత‌ప‌త్రం త‌యారీ ప‌నులు జ‌రుగుతుండ‌గా మే 30, 31వ తేదీల్లో ఈ వివ‌రాలు ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌సార‌మ‌య్యాయ‌ని తెలిపారు. అదేవిధంగా, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌లో 2016-17వ సంవ‌త్స‌రంలో ఒక పాఠ‌కురాలు పంపిన కుశుడి క‌థకు ప్ర‌చుర‌ణ‌కు అర్హ‌త లేద‌ని ప‌క్క‌న పెట్టార‌ని తెలిపారు. అయితే, అదే క‌థ‌ను బాల‌వాక్కు శీర్షిక‌న స‌ప్త‌గిరి ఏప్రిల్ నెల‌లో ప్ర‌చురించార‌ని చెప్పారు. ఏప్రిల్ నెల సంచిక ఇంకా మార్కెట్‌లోకి విడుద‌ల కాలేద‌ని, ఇంత‌లో కొంద‌రు దీనిపై తీవ్రంగా విమ‌ర్శించార‌ని తెలిపారు. ఈ రెండు అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచార‌ణ చేప‌ట్టామ‌ని, నేరారోప‌ణ రుజువైతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టిటిడిలో సేవ‌లందిస్తున్న ఉద్యోగులు బాధ్య‌తాయుతంగా న‌డుచుకోవాల‌ని కోరారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.