VIGILANCE SLEUTHS NAB TWO MORE DALARIS _ నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన వారిపై కేసు
Tirumala, 28 Jan. 22: TTD Vigilance Wing cops nabbed two more middle men who had cheated devotees with fake Rs.300 tickets collecting huge sum from them.
According to the information given by the concerned officials, TTD Vigilance wing officials on January 27 carried out surprise checks at Rs.300/ scanning point and on suspicion enquired one Sri C.Subramanian and two of his friends from Pondicherry, who told them that they reached Tirupati and contacted one auto driver who promised to arrange darshan tickets. For the same, they paid him Rs.4, 000 through phone pe and a cash amount of Rs. 4000/-.
The Auto driver named Mouna Kumar along with his friend Sounder arranged fake and fabricated darshan tickets to the pilgrim by changing data, name, and particulars. When the pilgrims reached Tirumala and enquired by TTD Vigilance sleuths, they realized they were cheated with fake tickets and gave complaint against the auto driver who sold the fabricated tickets at a whopping price.
Following the complaint by the pilgrims, the TTD Vigilance lodged a complaint in Tirumala Two Town Police Station and a case was registered in Cr.no.13/ 2022 U/s 420 &468 r/w 34 IPC.
TTD which has already appealed to devotees multiple times not to fall into the trap of the middlemen for darshan tickets has again cautioned them of such dalaris and asked them to book tickets only through the official website of TTD.
TTD Vigilance has also warned the Auto and Taxi drivers that if they are found involved in darshan ticket cheating cases their vehicles and driving licenses would be invariably seized and produced in the court for legal action against them.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన వారిపై కేసు
డ్రైవర్లు మోసం చేస్తే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో
తిరుమల, 2022 జనవరి 28: నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్‌తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
తిరుమల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్, అతని స్నేహితులను కలిపి ముగ్గురిని విచారించారు. తిరుపతిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌందర్ కలిసి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకోసం ఫోన్ పేలో రూ. 4 వేలు, మరో రూ.4 వేలు నగదు ఇచ్చామని భక్తులు తెలిపారు. ఈ టికెట్లతో దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నకిలీ టికెట్లుగా తేలడంతో మోసపోయామని గుర్తించామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబరు. 13/ 2022 U/S 420 & 468 r/w 34 IPC కేసు నమోదు చేశారు.
మోసం చేస్తే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నకిలీ దర్శన టికెట్లతో మోసం చేస్తే వారి వాహనాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తామని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. భక్తులు దర్శన టికెట్ల కోసం ఇలాంటి వారిని నమ్మి మోసపోకుండా, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.