VINAYAKA SWAMI POOJA

Tirupati, 25 Aug. 17:In Kapileswara Swamy temple, Vinayaka Chaviti festival observed in a ceremonial way. The deity of Lord Vinayaka was rendered special Abhishekam.

While in the evening the Lord took celestial procession on Moushika Vahanam and blessed the devotees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI


శ్రీ కపిలేశ్వరాలయంలో…

తిరుపతి, 2017 ఆగస్టు 25: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.