VIRAL DRONE VIDEO WILL BE SENT TO FORENSIC -CVSO _ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తాం : టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

TIRUMALA, 20 JANUARY 2023: A Video of Tirumala temple which is making rounds on social media platforms as taken through a Drone camera is baseless. However, it will be sent to the Forensic lab for verification said TTD Chief Vigilance and Security Officer Sri Narasimha Kishore.

He said the entire Tirumala is under the eagle eye of hi-fi Vigilance and Security and it is not possible to capture the video through a drone camera.

The CVSO also warned of legal procedure against the persons who videographed Tirumala temple if proved guilty.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తాం : టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

తిరుమల, 20 జనవరి 2023: శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తెలిపారు.

తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.