VIRATAPARVA – LOKA KALYANA PARAYANAM COMMENCES AT TIRUMALA _ లోక క‌ల్యాణార్థం విరాట‌ప‌ర్వం పారాయణం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

Tirumala, 15 Jul. 20:As a part of its spiritual mission to weed off ill effects of Corona COVID 19 virus from across the world, TTD has commenced Virataparvam-Loka Kalyana Paryanam at Tirumala on Wednesday evening.

Speaking on the inaugural day of Virataparva Parayanam, TTD EO Sri Anil Kumar Singhal said, after successfully taking forward Yoga Vasishtyam, Veda Parayanam and Sundarakanda Patanam, TTD has now embarked upon yet another spiritual fete, the recitation of the slokas of Virataparvam from the epic Maha Bharatam. 

The idea of organising series of Parayanams and telecasting them live on SVBC popped up with the suggestions from devotees and today crores of devotees are following our live programme across the world’,  he maintained. 

Additional EO and MD of SVBC Sri AV Dharma Reddy said, Virataparvam in Mahabharata is unique as it was in the Royal Court of King Virata, the Pancha Pandavas had successfully completed their one year in exile in disguise. With the presence of the loyal Pandavas, the entire kingdom of King Virata shined with prosperity. 

‘As we are now facing all difficulties of economic downfall not only in our state or country but across the world due to the dreadful coronavirus, we are commencing Virataparva – Loka Kalyana Parayanam from today onwards to bring back our economy back in good shape and also appeasing Varuna-the Rain God to shower good rains and bless the entire humanity with prosperity”, he said.

After the introduction by scholars, the Viraaparva Parayanam was commenced by Vedic Professors Sri Pavana Kumara Sharma and Sri Maruti.

Vedic Varsity VC Sri S Sudarshana Sharma,  RSVP VC Sri Muralidhara Sharma,  Dharmagiri Veda Pathashala Principal Sri KSS Avdhani, Higher Vedic Studies Special Officer Dr A Vibhishana Sharma were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక క‌ల్యాణార్థం విరాట‌ప‌ర్వం పారాయణం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
 
తిరుమ‌ల‌, 2020 జూలై 15: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌ఖ‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని తిరుమ‌ల‌లో విరాట‌ప‌ర్వం – లోక క‌ల్యాణ పారాయ‌ణం ప్రారంభించిన‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధ‌వారం రాత్రి విరాట‌ప‌ర్వం – లోక క‌ల్యాణ పారాయ‌ణం ప్రారంభ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భ‌క్తులు యోగ వాశిష్టం – ధ‌న్వంత‌రి మ‌హామంత్రం, సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొన్న‌ట్లు తెలిపారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా భ‌క్తుల కోరిక మేర‌కు లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ప్ర‌తి రోజు రాత్రి 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు విరాట‌ప‌ర్వం – లోక క‌ల్యాణ పారాయ‌ణం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. విరాట‌ప‌ర్వంలో వ్యాస‌మ‌హర్షి రాసిన ప్ర‌తి శ్లోకానికి అర్థతాత్ప‌ర్యాల‌తో పండితులు వివ‌రిస్తార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్నిఎస్వీబిసిలో ప్ర‌తి రోజు రాత్రి 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తార‌ని, భ‌క్తులు ఈ శ్లోకాల‌ను  ప‌ఠించాల‌ని కోరారు.  కొంద‌రు భ‌క్తులు ఎస్వీబిసిలో హెచ్‌డి ఛాన‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయాల‌ని కోరార‌ని, వారి కోరిక మేర‌కు త్వ‌ర‌లో అధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.    

అంత‌కుముందు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ మ‌హాభాత‌రంలో ధ‌ర్మం అంటే పాండ‌వులు కావున శ్రీ‌కృష్ణుడు ధ‌ర్మాస్వ‌రూపులు పాండ‌వుల ప‌క్ష‌పాతియై నిలిచాడ‌న్నారు. పాండ‌వులు విరాట‌రాజు కొలువులో ఒక సంవ‌త్స‌రం అజ్ఞాత వాసం చేశార‌ని, మారు వేషాల‌లో ఉన్న పాండ‌వులకు విరాట‌రాజు అశ్ర‌యం ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఉత్త‌ర గో గ్ర‌హ‌ణం, ద‌క్షిణ గో గ్ర‌హ‌ణంలో పాండ‌వులు అండ‌గా నిలిచి అత్య‌ద్భుతంగా విజ‌యాన్ని సాధించి పెట్టిన‌ట్లు తెలిపారు. త‌ద్వారా విరాట‌రాజు రాజ్యం సుభిక్షింగా ఉన్న‌‌ట్లు తెలిపారు. భీష్మ‌చార్యులు దుర్యోధ‌నునితో ఏ రాజ్యం అయితే సుభిక్షింగా ఉంటుందో ఆ రాజ్యంలో పాండ‌వులు ఉన్న‌ట్లు తెలియ‌జేసిన‌ట్లు తెలిపారు. విరాట‌రాజు ధ‌ర్మం వైపు నిల‌బ‌డ‌టం వ‌ల‌న పాండవుల త‌ద‌నంత‌రం ఉత్త‌ర అభిమ‌న్యుల సంతానం రాజ్య‌న్ని ప‌రిపాలించిన‌ట్లు తెలిపారు.
 
కావున విరాట‌ప‌ర్వం చ‌దివినా, విన్నా‌, పారాయణం చేసిన ఆ రాజ్యంలో వర్షా‌లు స‌మృద్ధిగా కురిసి సుభిక్షితంగా ఉంటుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా అస్థ‌వ్య‌స్థంగా ఉన్న‌ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్టి చేసుకోవ‌డానికి పండితుల‌తో చ‌ర్చించి విరాట‌ప‌ర్వం పారాయ‌ణం ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అనంత‌రం విరాట‌ప‌ర్వం – లోకక‌ల్యాణ పారాయ‌ణాన్ని వేదధ్యాప‌కులు శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ‌మారుతి ప‌ఠించారు
           
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ, రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ‌, వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.