VISAKHA POURNAMI GARUDA SEVA HELD IN TIRUMALA_ వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ

Tirumala, 29 April 2018: The first Pournami Garuda seva in this year was held with religious pomp and gaiety in Tirumala on Sunday.

On the auspicious day of Vaisakha Pournami Lord Malayappa Swamy took celestial ride on Garuda Vahanam in the four mada streets between 7pm and 9pm.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, ACVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, VGO Sri Raveendar Reddy,TTD higher authorities took part in this vahana seva.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ

ఏప్రిల్‌ 29, తిరుమల 2018: తిరుమలలో ఆదివారంనాడు రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ సంవత్సరంలో మొదటిసారి పౌర్ణమి గరుడసేవ కావడం, చిత్రా పౌర్ణమి కావడంతో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్ చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీి ఇ.ఓ శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.